Breaking News

మేడిగడ్డలో ‘డిజైన్‌’ లోపాలే!

Published on Fri, 01/10/2025 - 04:55

సాక్షి, హైదరాబాద్‌: మేడిగడ్డ బరాజ్‌ కుంగిపోవడానికి డిజైన్లు, డ్రాయింగ్స్‌లో లోపాలే కారణమని ఐఐటీ–రూర్కీ తాజాగా నిర్వహించిన మాడల్‌ స్టడీలో తేలింది. బరాజ్‌ను 2019 జూన్‌ 21న ప్రారంభించగా, అదే ఏడాది వచ్చిన వరదల్లో బరాజ్‌ దిగువన రక్షణ కోసం నిర్మించిన కాంక్రీట్‌ బ్లాక్‌లు కొట్టుకుపోయాయి. బరాజ్‌ గేట్లను ఎత్తినప్పుడు భీకర వేగంతో వరద కిందకు దూకుతుంది. 

ఆ సమయంలో వరదలో ఉండే భీకర శక్తిని నిర్వీర్యం(ఎనర్జీ డిస్సిపేషన్‌) చేసేందుకు తగిన నిర్మాణాలను డిజైన్లలో ప్రతిపాదించలేదు. దీంతో ఆ శక్తి ధాటికి దిగువన ఉన్న కాంక్రీట్‌ బ్లాకులు కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. బరాజ్‌ను ప్రారంభించిన తొలి ఏడాదే కాంక్రీట్‌ బ్లాకులు కొట్టుకుపోయినా, పునరుద్ధరించలేదు. ఆ తర్వాత బరాజ్‌కు 2020–23 మధ్యకాలంలో వరుసగా నాలుగేళ్ల పాటు వరదలు రాగా, ‘ఎనర్జీ డిస్సిపేషన్‌’ఏర్పాట్లు లేక బరాజ్‌ దిగువన మట్టి క్రమంగా కొట్టుకుపోయి గుంతలు మరింతగా లోతుగా మారాయి. 

నిరంతర వరదలతో బరాజ్‌ ర్యాఫ్ట్‌(పునాది) కింద రక్షణగా నిర్మించిన సికెంట్‌ పైల్స్‌ వరకు ఈ గుంతలు విస్తరించాయి. దీంతో సికెంట్‌ పైల్స్‌ దెబ్బతినడంతో ర్యాఫ్ట్‌ కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి బుంగలు ఏర్పడడానికి దారితీశాయి. దీనిద్వారా నీళ్లు బయటకు లీకైనట్టు గుర్తించినా, వాటిని పూడ్చివేసే విషయంలో తాత్సారం చేశారు. 

దీంతో కాలం గడిచిన కొద్దీ బుంగల తీవ్రత పెరిగి బరాజ్‌ కుంగిపోవడానికి దారితీసిందని ఐఐటీ–రూర్కీ నిర్వహించిన మోడల్‌ స్టడీస్‌లో తేలింది. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ విజ్ఞప్తి మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్, ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం) బి.నాగేంద్రరావు, ఇతర ఇంజనీర్ల సమక్షంలో ఐఐటీ రూర్కీ నిపుణులు ఈ పరీక్షలు నిర్వహించారు. 

టెయిల్‌ పాండ్‌ ఉంటే ....
మేడిగడ్డ బరాజ్‌ దిగువన తగిన స్థాయిలో నీరు నిల్వ ఉండేలా టెయిల్‌పాండ్‌ నిర్మాణం లేకపోవడమే అసలు లోపమని మోడ ల్‌ స్టడీలో తేలింది. బరాజ్‌ గేట్ల నుంచి భీకర వేగంతో వరద దిగువన టెయిల్‌పాండ్‌లోని నీళ్లలో దూకినప్పుడు అందులోని శక్తి విభజనకులోనై అన్నివైపులా వ్యాప్తి చెంది చివరకు నిర్వీర్య మైపోతుంది. దీనినే ఎనర్జీ డిస్సిపేషన్‌ అంటారు. మేడి గడ్డ బరాజ్‌ గేట్లను దిగువన తగిన స్థాయిలో నీరు నిల్వ ఉండేలా టెయిల్‌పాండ్‌ నిర్మాణాన్ని డిజైన్లలో ప్రతిపాదించలేదని నీటిపా రుదలశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 

వరదలు తక్కు వగా ఉన్నప్పుడు బరాజ్‌ గేట్లను తక్కువ ఎత్తులో పైకి లేపి వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు వదులుతారు. ఆ సమయంలో సైతం బరాజ్‌లో గరిష్ట మట్టం మేరకు నిల్వలుండడంతో గేట్ల నుంచి బయటకు వచ్చే వరదలో తీవ్రమైన పీడన శక్తి ఉంటుంది. గేట్లను 10–30 సెంటిమీటర్లు మాత్రమే పైకి ఎత్తినా, సెకనుకు ఏకంగా 30 మీటర్ల వరకు భీకర వేగంతో వరద బయటకు వస్తోందని మోడల్‌ స్టడీలో తేలినట్టు తెలిసింది. 

దీంతోనే బరాజ్‌ దిగువన రక్షణగా ఉండాల్సిన సీసీ బ్లాకులు కొట్టుకు పోయి వాటి స్థానంలో గుంతలు ఏర్పడ్డాయని, ఆ తర్వాత గుంతలు లోతుగా మారి పునాదులను దెబ్బతీశాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి ఐఐటీ రూర్కీ మాడల్‌ స్టడీస్‌ నివేదికను నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ సమర్పించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)