Breaking News

నాన్న కల నెరవేర్చా..

Published on Sun, 11/30/2025 - 10:55

ఆదిలాబాద్‌: ‘సివిల్స్‌ సాధించాలనేది నాన్న కల.. ఆయన మూడుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు.. చివరకు విరమించుకున్నారు.. అప్పుడే అనుకున్నా.. ఎలాగైనా దానిని నెరవేర్చాలని.. ఈ క్రమంలో పీహెచ్‌డీని సైతం వదిలేశా.. పుస్తకాలతో కుస్తీ పట్టా.. ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు ప్రయత్నాల్లో పరాజయం.. అయినా వెనుకడుగు వేయలేదు.. లక్ష్యం వీడలేదు.. నాన్న మార్గదర్శకంలో ముందుకు సాగా.. ఐదోసారి సత్తా చాటా.. ఐపీఎస్‌కు ఎంపికయ్యా.. డాడీ కల నెరవేర్చా.. ఆయన కళ్లల్లో ఆనందం చూశా.. సాధించాలనే తపనకు శ్రమ తోడైతే  కొంత ఆలస్యమైనా విజయం తథ్యమని ఏఎస్పీ పి.మౌనిక అన్నారు. అందుకు తానే నిదర్శనమని చెప్పారు. ఇటీవల జిల్లాలో బాధ్యతలు చేపట్టిన ఆమె ‘సాక్షి’తో శనివారం తన ప్రస్తానంపై ముచ్చటించారు.        

కుటుంబ నేపథ్యం ...
మాది హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌. నాన్న పోరిక రాంకుమార్‌. డిఫెన్స్‌లోని బీడీఎల్‌లో ఏజీఎంగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అమ్మ వాణికుమారి. భద్రాచలంలో పెట్రోల్‌ బంక్‌ల నిర్వహణతో పాటు సేంద్రియ వ్యవసాయం చేస్తారు. తమ్ముడు మోహిత్‌ కుమార్‌ వ్యాపారంలో స్థిరపడ్డాడు. నాన్న సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. మూడుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఎంపికవ్వలేదు. దీంతో నన్ను సివిల్స్‌కు ప్రోత్సహించారు. ఆటంకా లు ఎదురైనా కుంగిపోవద్దని వెన్నుతట్టారు. మార్గదర్శనం అందిస్తూ విజయబాటలో నడిపించారు. 

చదువంతా హైదరాబాద్‌లోనే.. 
నా చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. టెన్త్‌ వ రకు డీఏవీ పబ్లిక్‌ స్కూల్, ఇంటర్‌ శ్రీ చైతన్యలో పూ ర్తిచేశా. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ తర్వాత జర్మనీకి వెళ్లా. ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ మూడేళ్లు చదివిన త ర్వాత మధ్యలోనే వదిలేశా. నాన్న కోరిక మేరకు హైదరాబాద్‌కు వచ్చి సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యాను. నాలుగు సార్లు ప్రయత్నించినా లక్ష్యం చేరుకోలేదు. కొంత నిరుత్సాహంతో పాటు అటు పీహెచ్‌డీ సైతం వదిలి వచ్చాననే ఆందోళనకు గురయ్యా. ఈ క్రమంలో నాన్న వెన్నుతట్టి ప్రోత్సహించారు. లోపాలను సవరించుకుని ముందుకు సాగా. 2021లో సివిల్స్‌లో 637వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యా. 

పెద్దల అంగీకారంతోనే వివాహం
ముస్సోరిలో వంద రోజుల పాటు ఐపీఎస్‌ శిక్షణ పొందాను. తర్వాత హైదరాబాద్‌లోని నేషనల్‌ పో లీస్‌ అకాడమీలో రెండేళ్ల పాటు ట్రైనింగ్‌ సాగింది. ఐపీఎస్‌ శిక్షణ సమయంలో ప్రస్తుతం ఐటీడీఏ పీవో గా పనిచేస్తున్న యువరాజ్‌ మర్మాట్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలియజేయగా వారు అంగీకరించారు. 2023 ఆగస్టు 21న చత్తీస్‌గఢ్‌లో వివా హం చేసుకున్నాం. మర్మాట్‌ స్వగ్రామం రాజస్థాన్‌లోని సవాయిమాదాపూర్‌. పెళ్లయిన తర్వాత  వేర్వే రు ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకే జిల్లాలో పని చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. వంట చేయడం, జిమ్‌కు వెళ్లడం నా హాబీ.

యువత లక్ష్యసాధనపై దృష్టి సారించాలి
కృషి , పట్టుదల ఉంటే లక్ష్యం నెరవేర్చడం కష్టమేమి కాదు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాల బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియాకు ఆకర్షితులు కావద్దు. ముఖ్యంగా అమ్మాయిలు సామాజిక మాధ్యమాల ద్వారా అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయవద్దు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి. రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనే ఆశ అనర్థాలకు దారి తీస్తుంది. క్రమశిక్షణ అలవర్చుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)