Breaking News

ఐ–ఫోన్లకూ తప్పని ఫేక్‌ లోన్‌యాప్‌ల బెడద

Published on Sat, 12/13/2025 - 04:52

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ భద్రత పరంగా సురక్షితంగా భావించే ఐ–ఫోన్లకు ఫేక్‌లోన్‌ యాప్‌ల బెడద తప్పడం లేదు. ఆండ్రాయిడ్‌ ఫోన్ల మాదిరిగానే యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో ఇటీవల మూడు ఫేక్‌ లోన్‌ యాప్‌లను గుర్తించినట్టు కేంద్ర హోంశాఖకు చెందిన ఐ4సీ (ఇండియన్‌ సైబర్‌ క్రైం కో–ఆర్డినేషన్‌ సెంటర్‌) వెల్లడించింది. థిన్‌లోన్, రిష్నాలోన్, అంబాలా క్యాష్‌ అనేవి నకిలీ యాప్‌లు అని తెలిపింది.

ఈ యాప్‌లను గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచించింది. ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేస్తే వ్యక్తిగత సమాచారం దొంగిలించి ఆ తర్వాత ఆన్‌లైన్‌ బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. డాక్యు మెంట్లు లేకుండా లోన్లు ఇస్తామని ఊదరగొట్టే ఈ యాప్‌లను నమ్మి మోసపోవద్దని తెలిపింది. అనుమానాస్పద యాప్‌లకు సంబంధించిన సమాచారం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930లో లేదా  cybercrime. gov. in లో ఫిర్యాదు చేయా లని అధికారులు సూచించారు.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)