Breaking News

జూన్‌ 1 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు 

Published on Sat, 05/13/2023 - 03:37

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభించవచ్చు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ శుక్రవారం విడుదల చేశారు.

జూన్‌ 30లోగా ప్రవేశాలు పూర్తి చేయాలని,ఇంటర్‌ మొదటి సంవత్సరం క్లాసులు జూన్‌ 1 నుంచి ప్రారంభించాలని సూచించారు. అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించవద్దని కాలేజీలకు సూచించారు. టెన్త్‌ గ్రేడింగ్‌ ఆధారంగానే ప్రవేశాలు జరపాలని ఆదేశించారు. ఇంటర్‌ బోర్డ్‌ గుర్తింపు ఉన్న కాలేజీల జాబితాను టీఎస్‌బీఐఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతామని, ఆ కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని సూచించారు.

ప్రతీ కాలేజీ రిజర్వేషన్‌ పాటించాలని ఆదేశించారు. సీట్లలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29, వికలాంగులకు 3, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఇతర అర్హతలున్న వారికి 5, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం కేటాయించాలన్నారు. ప్రతీ కాలేజీ బాలికలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొన్ని మార్గదర్శకాలను బోర్డ్‌ విడుదల చేసింది. 

మార్గదర్శకాలు ఇవీ... 
♦ ఇంటర్‌లో ప్రతీ సెక్షన్‌లో 88 మంది విద్యార్థులనే చేర్చుకోవాలి. అదనపు సెక్షన్లు నిర్వహించాలంటే కాలేజీ విధిగా బోర్డ్‌ అనుమతి తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా ఏ కాలేజీ వ్యవహరించినా కఠిన చర్యలుంటాయి.  
♦  విద్యార్థుల ఆధార్‌ నెంబర్‌ తప్పకుండా నమో దు చేయాలి. అడ్మిషన్ల వివరాలను ప్రతీ రోజూ కాలేజీ బోర్డుపై ఉంచాలి. ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి? ఎన్ని మిగిలి ఉన్నాయి? అప్‌డేట్‌ సమాచారం బోర్డ్‌పై ప్రదర్శించాలి.  
♦  జోగిని, తండ్రి లేని పిల్లల విషయంలో పేరెంట్స్‌ కాలమ్‌లో తల్లి పేరు నమోదు చేయాలి. బాలికలకు అన్ని రకాల రక్షణ వ్యవస్థను కాలేజీలే క ల్పించాలి.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)