Breaking News

శాకాహార భోజనం మరింత ప్రియం

Published on Sun, 07/07/2024 - 04:49

సాక్షి, అమరావతి: కూరగాయల ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కల­తో ఓ పక్క శాకాహార భోజన ధరలు పెరుగు­తుంటే అదే సమయంలో బాయిలర్‌ చికెన్‌ ధరలు తగ్గడంవల్ల మాంసాహార భోజన ధరలు తగ్గాయి. 

దేశవ్యాప్తంగా సగటున చూసు­కుంటే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే శాకాహార భోజన ధరలు పది శాతం పెరిగితే మాంసాహార భోజన ధరలు నాలు­గు శాతం తగ్గినట్లు క్రిసిల్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రిసిల్‌ ప్రతినెలా విడుదల చేసే ‘రోటీ రైస్‌ రేట్‌’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 

ప్లేట్‌ రోటీ రూ.26.7 నుంచి రూ.29.4కు పెరుగుదల
గతేడాది జూన్‌లో సగటున రూ.26.7గా ఉన్నప్లేట్‌ రోటీ ధర (రోటీ, కర్రీ, పెరుగుకప్పు) ఇప్పుడు రూ.29.4కు పెరిగింది. శాకాహార భోజన ధరలు పెరగడంలో కూరగాయలు కీలక భూమిక పోషించినట్లు క్రిసిల్‌ పేర్కొంది. ఎందుకంటే.. 2023తో పోలిస్తే టమోటా ధరలు 30 శాతం, ఉల్లిపాయలు 46 శాతం, బంగాళాదుంప 59 శాతం పెరగడం ప్రధాన కారణంగా పేర్కొంది.

వేసవిలో అకాల వర్షాలకు తోడు రబీసాగు తగ్గడంతో బంగాళాదుంప, ఉల్లిపాయల ధరలు కూడా పెరగడానికి కారణంగా పేర్కొంది. అలాగే, టమోటా అత్యధికంగా పండే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదవడంతో టమాటా దిగుబడులు పడిపోయాయి. ఇదే సమయంలో బియ్యం ధరలు 13 శాతం, కందిపప్పు ధర 22 శాతం పెరిగినట్లు క్రిసిల్‌ పేర్కొంది. 

ప్లేట్‌ చికెన్‌ థాళీ ధర ఢమాల్‌..
మరోవైపు.. 2023లో రూ.60.5గా ఉన్న ప్లేట్‌ చికెన్‌ థాళీ ధర ఇప్పుడు రూ.58కు పడిపోయింది. చికెన్‌ థాళీ ధరలో 50 శాతం వాటా ఉండే బాయిలర్‌ చికెన్‌ ధర గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గడం దీనికి కారణంగా క్రిసిల్‌ పేర్కొంది. ఒక సాధారణ కుటుంబంలో ఒక వెజ్‌ లేదా నాన్‌ వెజ్‌ థాళీ చేసుకోవడానికి సగటున అయ్యే వ్యయం ఆధారంగా క్రిసిల్‌ ఈ నివేదికను రూపొందించింది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు