Breaking News

TS: తప్పులు లేకుండా ఇంటర్‌ ఫలితాలు

Published on Thu, 04/27/2023 - 10:22

సాక్షి, హైదరాబాద్‌: ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఈసారి ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఫలితాల వెల్లడి ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ బుధవారం పరీక్షల విభాగం అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. స్పాట్‌ వ్యాల్యుయేషన్, మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్‌ ప్రక్రియ, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు విధానాలపై చర్చించారు.

ప్రతీ సంవత్స రం పరీక్షలు, ఫలితాల వెల్లడిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈసారి ఇంటర్‌ పరీక్షల్లో విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఇదే స్ఫూర్తిని ఫలితాల వెల్లడిలోనూ కనబరచాలనే ఆలోచనలో ఉన్నారు. ఫలితాల వెల్లడికి అవసరమైతే కొంత సమయం తీసుకోవడానికైనా వెనుకాడవద్దని, అన్ని స్థాయిల్లో పరిశీలించిన తర్వాతే ముందుకెళ్ళాలని అధికారులకు మిత్తల్‌ సూచించారు. ఆన్‌లైన్‌ ఫీడింగ్‌లో గతంలో అనేక పొరపాట్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై అధికారులు లోతుగా అధ్యయనం చేశా రు. మార్కుల నమోదులో గతంలో ఎందుకు సమస్యలొచ్చాయి? సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలా? వ్యక్తుల తప్పిదాలా? అనే అంశాలపై మిత్తల్‌ ఆరా తీశా రు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సాఫ్ట్‌వేర్‌ను పూర్తిస్థాయిలో నిపుణుల చేత పరిశీలించాలని సూచించారు.

పరీక్షలు రాసిన 9 లక్షల మంది విద్యార్థులు 
ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి దాదాపు 9 లక్షల మంది ఈసారి పరీక్ష రాశారు. ఇంతమంది మార్కుల నమోదు విషయంలో ప్రత్యేక పరిశీలనకు అధికారులను నియమించారు. అంతిమంగా అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫలితాల వెల్లడికి సిద్ధమవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత ఎక్కడైనా తప్పు జరిగిందని భావిస్తే, మార్కులను మాన్యువల్‌గా తెప్పించి చూడటం ఆలస్యమవ్వొచ్చు.

దీన్ని దృష్టి లో ఉంచుకుని ఆన్‌లైన్‌లో వీలైనంత త్వరగా విద్యార్థి రాసిన పేపర్‌ను పరిశీలించే ఏర్పాట్లు చేయాలని, ఏ ఒక్క విద్యార్థి కూడా అధైర్యపడకుండా చర్యలు తీసుకోవాలని మిత్తల్‌ సూచించారు. మరో మూడు నాలుగు రోజుల్లో ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించే వీలుందని బోర్డుకు సంబంధించిన ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. మే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు వెల్లడించాలనే పట్టుదలతో అధికారులున్నారు.
 

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)