Breaking News

చిన్నారి చికిత్స కోసం రూ.14 కోట్ల క్రౌడ్‌ ఫండింగ్‌

Published on Thu, 05/22/2025 - 12:40

సాక్షి, హైదరాబాద్‌: స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ (ఎస్‌ఎంఏ) అనే వ్యాధితో బాధపడుతున్న 10 నెలల చిన్నారి చికిత్స కోసం 8 వేల మంది దాతలు స్పందించారు. ఈ పాప చికిత్సలో ఉపయోగించే ‘జోల్జెన్స్మా’ఇంజెక్షన్‌ ఖరీదు రూ.14 కోట్లు కాగా...దాతల సాయంతో విజయవంతంగా చికిత్స పూర్తి చేశామని సికింద్రాబాద్‌ రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆసుపత్రి వైద్యుడు రమేశ్‌ కోనంకి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

నగరానికి చెందిన వినీత్‌ చౌదరి దంపతులకు పది నెలల క్రితం చిన్నారి జన్మించింది. పుట్టిన తరువాత నాలుగు నెలలు గడిచినా కండరాల్లో సరైన కదలికలు లేకపోవడంతో వైద్యులను సంప్రదించారు. పరీక్షలు నిర్వ హించిన అనంతరం చిన్నారికి ఎస్‌ఎంఏ అనే వ్యాధి సోకిందని నిర్ధారించారు. సకాలంలో చికిత్స అందకపోతే రెండేళ్లకు మించి చిన్నారి బతకడం కష్టమని గుర్తించారు. 

ఈ చికిత్సకు ఉపయోగించే జోల్జెన్స్మా ఒక డోసు ఇంజెక్షన్‌ ఖరీదు రూ.14 కోట్లు ఉంటుందని చెప్పారు. దీనికోసం క్రౌడ్‌ ఫండింగ్‌ను అనుసరించగా.. సుమారు 8 వేల మంది సాయం చేశారని డాక్టర్‌ రమేశ్‌ తెలిపారు. దీంతో సికింద్రాబాద్‌ రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చిన్నారికి వారం రోజుల క్రితం విజయవంతంగా చికిత్స చేశామని, ఇప్పుడు పాప పూర్తిగా కోలుకుందని తెలిపారు. చిన్నారి తండ్రి వినీత్‌ చౌదరి మాట్లాడుతూ చికిత్సకు సాయం చేసిన ఎంతో మంది దాతలు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)