Breaking News

‘గ్రీన్‌చానల్‌’లో ఇందిరమ్మ ఇళ్లు

Published on Tue, 11/05/2024 - 05:39

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇందిరమ్మ ఇళ్లు కట్టుకొనే వారికి ఆర్థిక సమస్యలు రాకుండా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం గ్రీన్‌చానల్‌ రూపొందించిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఖమ్మంలోని దానవాయిగూడెంలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విభాగాలు, శాఖల మధ్య సాంకేతిక అడ్డంకులు లేదా ఆర్థికపరమైన చిక్కులు తలెత్తకుండా గ్రీన్‌ చానల్‌ విధానం ద్వారా లబ్ధిదారులకు నిధులు చెల్లిస్తామన్నారు.

పునాదుల సమయాన రూ. లక్ష, లింటెల్‌ లెవల్‌ పూర్తి కాగానే రూ. 1.20 లక్షలు, స్లాబ్‌ వేశాక రూ. 1.75 లక్షలు, గృహప్రవేశంకన్నా ముందు లేదా ఆ తర్వాత మిగిలిన సొమ్ము చెల్లిస్తామని చెప్పారు. ఇదంతా గ్రీన్‌చానల్‌ విధానంలో ఆటంకాలు లేకుండా పూర్తవుతుందన్నారు. తొలిదశలో రేషన్‌ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించామని.. త్వరలో రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ మొదలుకానుండగా రెండో విడత నుంచి రేషన్‌ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు పొందేందుకు అర్హులవుతారని తెలిపారు.

వై.ఎస్‌. హయాంలో తెలంగాణలో 19.56 లక్షల ఇళ్లు..
ఇందిరమ్మ ఇళ్లు అంటేనే కాంగ్రెస్‌ పార్టీ పేటెంట్‌ అని పొంగులేటి తెలిపారు. నాటి ఉమ్మడి ఏపీ పరిధిలోకి వచ్చే నేటి తెలంగాణలో 19.56 లక్షల ఇళ్లను దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పుడు తహసీల్దార్‌ లేదా ఎంపీడీఓ గుర్తించాక కలెక్టర్‌ ద్వారా ఇన్‌చార్జి మంత్రి ఆమోదిస్తారని తెలిపా రు. మహిళల పేరుతో 400 చదరపు అడుగుల్లో ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాబోయే 2, 3 రోజుల్లోనే గ్రామసభల ద్వారా అర్హులను గుర్తిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

ఇళ్ల నిర్మాణంలో సాంకేతికత కోసం యాప్‌ రూపొందించామని, లబ్ధిదారులను ఇళ్ల వద్దకు తీసుకెళ్లి వివరాలు అప్‌లోడ్‌ చేయడం వల్ల ఎప్పటికప్పుడు పురోగతి తెలుస్తుందన్నారు. భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తీసుకొనేందుకు ప్రయతి్నస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్‌ సొంతూరు చింతమడకతో సహా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో నిలిచిపోయిన సుమారు 63 వేల డబుల్‌ బెడ్రూం ఇళ్లను కూడా నిర్మించి పేదలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు పొంగులేటి వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)