Breaking News

రాష్ట్రంలో భారీగా రైల్వే సేవల విస్తరణ

Published on Sun, 07/20/2025 - 04:28

సాక్షి, హైదరాబాద్‌/కాచిగూడ: తెలంగాణలో రైల్వే మౌలిక వసతులను భారీగా విస్తరించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. దశలవారీగా రైల్వే నెట్‌వర్క్‌ పెంచినట్లు చెప్పారు. కాచిగూడజో«ద్‌పూర్‌ డెయిలీ ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్విసును శనివారం కాచిగూడ స్టేషన్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న రాజస్తాన్‌ ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు.

హైదరాబాద్‌ నుంచి భోపాల్‌ మీదుగా జోద్‌పూర్‌కు ప్రతిరోజూ రైలు రాకపోకలు సాగిస్తుందని చెప్పారు. ఈ రైలును అహ్మదాబాద్‌ మీదుగా నడపాలని డిమాండ్లు వస్తున్నాయని, కానీ అహ్మదాబాద్‌లో కొన్ని నిర్మాణ పనుల వల్ల ప్రస్తుతం ఆ మార్గంలో నడపడం సాధ్యం కాదని తెలిపారు. మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైల్వేస్టేషన్లను ఆధునిక హంగులతో పునరాభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.720 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సహా సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.

శంకర్‌పల్లి టు కాజీపేట రైలు ప్రయాణం
శంకర్‌పల్లి: సంగారెడ్డి జిల్లాలోని ఐఐటీ హైదరాబాద్‌ స్నాతకోత్సవానికి శనివారం వచ్చిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. అక్కడ నుంచి కాజీపేటకు వెళ్లేందుకు రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అక్కడి నుంచి రైలులో కాజీపేటకు ప్రయాణించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తదితరులు ఉన్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)