Breaking News

2047 నాటికి మన దేశమే నంబర్‌ వన్‌

Published on Tue, 08/15/2023 - 10:25

హైదరాబాద్: అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన 2047 నాటికి భారత్‌ను నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపేందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న 25 ఏళ్లను అమృత కాలంగా పరిగణిస్తూ రాజకీయాలకతీతంగా దేశ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగం, పేదరికం లేనటువంటి దేశంగా అభివృద్ధి దిశగా ముందుకెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు ఆధ్వర్యంలో సోమవారం బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయం వద్ద తిరంగా ర్యాలీని కిషన్‌రెడ్డి ప్రారంభించారు.

 ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి వారిలో వెలుగులోకి రానివారి జీవిత చరిత్రను, ఆధ్యాత్మికమైన ప్రముఖ వ్యక్తుల చరిత్రను రేపటి తరానికి అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా గత ఏడాది దేశంలో 25 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేశారని, అదే స్ఫూర్తితో ఆగస్టు 15, జనవరి 26న ప్రతి భారతీయుడి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. 

75 మీటర్ల జాతీయ జెండాతో బర్కత్‌పురా చమన్‌ నుంచి కాచిగూడ చౌరస్తాలోని వీరసావర్కర్‌ విగ్రహాం వరకు తిరంగా ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి జి.కావ్యారెడ్డి, బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు కె.గీతామూర్తి, నీరజ,  కార్పొరేటర్లు బి.పద్మ వెంకట్‌రెడ్డి, కన్నె ఉమారమేష్‌ యాదవ్, వై.అమృత, పార్టీ నేతలు అట్లూరి సుభాషిణి, కృష్ణాగౌడ్, ఎ.సూర్యప్రకాష్‌ సింగ్, ఎడెల్లి అజయ్‌ కుమార్, సి.నందకిషోర్‌ యాదవ్, సి.వినోద్‌ యాదవ్, వనం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)