Breaking News

వేసవి సెలవుల్లో జనగణన

Published on Fri, 01/23/2026 - 02:29

సాక్షి, హైదరాబాద్‌: వేసవి సెలవుల్లో రాష్ట్రంలో జనగణన నిర్వహించే అవకాశం ఉంది. జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్యకాలంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 30 రోజులపాటు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇంటింటి సర్వేకి సరిగ్గా 15 రోజుల ముందు స్వీయ నమోదు (సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌) ఆప్షన్‌ను వినియోగించుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించనున్నారు.

దేశ వ్యాప్తంగా జనగణన–2027 నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ గత జనవరి 7న జారీ చేసిన గజిట్‌ నోటిఫికేషన్‌ను రాష్ట్రంలో మళ్లీ నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌– సెపె్టంబర్‌ మధ్యలో ఇంటింటి సర్వే జరిగే 30 రోజులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి కేంద్రానికి తెలియజేయనుంది. విద్యార్థులకు పరీక్షలు ముగిసిన తర్వాత వేసవి సెలవుల్లో రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించే అవకాశం ఉంది. ఏప్రిల్‌ లేదా మే నెలల్లో నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)