Breaking News

జార్ఖండ్‌ ప్రజలు విశ్వసించి పట్టం కట్టారు

Published on Sun, 11/24/2024 - 01:12

సాక్షి, హైదరాబాద్‌: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు సమష్టి విజయమని, అక్కడి ప్రజలు తమను విశ్వసించి పట్టం కట్టారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం, జార్ఖండ్‌ వనరుల పరిరక్షణ గురించి తాము ప్రజలకు చేసిన విజ్ఞప్తిని మన్నించారని, అందుకే ఇండియా కూటమికి ఘన విజయం చేకూర్చారని అన్నారు. జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీనియర్‌ పరిశీలకుడి హోదాలో శనివారం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాంచీకి వెళ్లారు.

 అక్కడ రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యాలయంతో పాటు జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ నివాసంలో జరిగిన విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ జేఎంఎం నేతృత్వంలో కూటమి గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంతోపాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పగలిగామని, అందుకే భారీ విజయం సాధ్యమైందన్నారు. 

జార్ఖండ్‌ ప్రజలకు బీజేపీపై భ్రమలు లేవని, అందుకే ఇండియా కూటమి వైపు నిలిచారని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రజలిచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెడతామని భట్టి స్పష్టం చేశారు. కాగా, జార్ఖండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భట్టి కీలకపాత్ర పోషించారు. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు, పార్టీ మేనిఫెస్టో తయారీ, వ్యూహాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు. పలు దఫాలుగా ప్రచారానికి వెళ్లారు.

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

తెలగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)