Breaking News

అందరికీ సంతాన భాగ్యం!

Published on Wed, 10/16/2024 - 03:21

రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ దవాఖాన్లలో ఐవీఎఫ్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు ఇది ఓ రకంగా శుభవార్త అని డాక్టర్లు చెబుతున్నారు. సంతానం కోసం అనేకమంది దంపతులు ఐవీఎఫ్‌ సెంటర్లను ఆశ్రయిస్తూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్‌ పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరీ బాధితుల వద్ద రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. 

రూ. 50 నుంచి రూ. 80 వేల ఖర్చులో పూర్తయ్యే ఐవీఎఫ్‌ చికిత్సకు, రూ.3 నుంచి రూ.6 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా, సగం మందికి ఫలితం దక్కడం లేదు. కానీ, ప్రైవేట్‌ ఆస్పత్రులు మార్కెటింగ్‌ ట్రిక్స్‌తో బాధిత దంపతులను మభ్యపెట్టి లక్షల్లో దండుకుంటున్నాయి.      –సాక్షి, హైదరాబాద్‌

పెరుగుతున్న ఇన్‌ఫర్టిలిటీ సమస్యలు
రాష్ట్రంలో యువతకు సంతాన సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రతి వంద జంటల్లో 30 నుంచి 40 జంటలు ఏదో ఒక స్థాయి ఇన్‌ఫర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. ప్రభుత్వ దవాఖాన్లలో ఇన్‌ఫర్టిలిటీకి ట్రీట్‌మెంట్‌ అందించే సౌకర్యాలు లేకపోవడం, ప్రైవేట్‌ ఆస్పత్రులు రూ.లక్షల్లో చార్జీలు వసూలు చేస్తుండడంతో ఎంతో మంది మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారు. మారిన జీవనశైలితో ఆడ, మగ ఇద్దరిలోనూ ఇన్‌ఫర్టిలిటీ సమస్యలు పెరిగాయని వైద్య,ఆరోగ్యశాఖ అంచనా వేస్తుంది. 

పిల్లలు పుట్టకపోవడంతో కొత్త జంటలు మానసిక వేదనను అనుభవిస్తున్నాయి. ఈ సమస్య తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లు పెడుతామని 2017లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 2023 వరకూ ఒక్క గాం«దీలో మాత్రమే ఫర్టిలిటీ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అందులో సౌకర్యాలు కల్పించలేదు. 

నెల రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి దామోదర దృష్టికి ఈ విషయాన్ని అధికారులు తీసుకొచ్చారు. దీంతో ఆయన ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించాలని, అవసరమైన పరి కరాలు, మెడిసిన్‌ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్య తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలిటీ, ఐవీఎఫ్‌ సేవలను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)