Breaking News

నేడో రేపో ఆల్మట్టి గేట్లు ఎత్తివేత

Published on Tue, 07/16/2024 - 02:09

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎగువన వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద తీవ్రత మళ్లీ పుంజుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక పశ్చిమ కనుమల్లో వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో వరద ఉధృతి పెరిగింది. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లోకి సోమవారం సాయంత్రం నాటికి 45 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా, నిల్వలు 95.22 టీఎంసీలకు చేరుకున్నాయి. జల విద్యుదుత్పత్తి ద్వారా ఆల్మట్టి నుంచి 9,730 క్యూసెక్కులను దిగువన నారాయణపూర్‌ జలాశయానికి విడుదల చేస్తున్నారు.

వర్షాలు, వరదలు కొనసాగితే ఒకటీ రెండురోజుల్లో ఆల్మట్టి డ్యామ్‌ గేట్లను ఎత్తి నీళ్లను దిగువకు విడుదల చేసే అవకాశముంది. దీనికి దిగువన ఉన్న నారాయణపూర్‌ డ్యామ్‌ గరిష్ట నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 26.72 టీఎంసీలున్నాయి. దీంతో ఆల్మట్టి డ్యామ్‌ గేట్లను ఎత్తిన ఒకటి రెండు రోజుల్లోనే నారాయణపూర్‌ గేట్లను ఎత్తే అవకాశముంది.

దీంతో తెలంగాణలోని జూరాల జలాశయానికి వరద చేరుకోనుండగా, వెంటనే గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి నీళ్లను విడుదల చేయనున్నారు. ఎందుకంటే జూరాల జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.72 టీఎంసీల నిల్వలున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుకోవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

తుంగభద్ర బేసిన్‌లోనూ వర్షాలు
కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్‌లోనూ వర్షా లు కురుస్తుడడంతో తుంగభద్రకు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. తుంగభద్ర        æద్ర గేట్లను ఎత్తే అవకాశముంది. అప్పుడు తుంగభద్ర జలాలు కూడా సుంకేశుల బరాజ్‌ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరతాయి. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)