Breaking News

ఎన్‌హెచ్‌ఎంలో పెరిగిన కేంద్రం వాటా

Published on Mon, 04/14/2025 - 01:53

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో మెరుగైన వైద్య సేవల కోసం ఉద్దేశించిన నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రానికి వచ్చే కేంద్ర నిధులు ఈసారి గణనీయంగా పెరిగాయి. జనాభాకు అనుగుణంగా రాష్ట్రానికి రావలసిన వాటా విషయంలో పదేళ్లుగా సవతి తల్లి ప్రేమ చూపిన కేంద్రం 2024–25 కింద ఇవ్వాల్సిన దానికన్నా అదనంగా రూ. 176 కోట్లు విడుదల చేయడం విశేషం. ఎన్‌హెచ్‌ఎం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 వాటాతో నిధులను వెచి్చంచాల్సి ఉంటుంది. 

రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లు, జిల్లా ఆసుపత్రుల నిర్మాణం, ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌ చేయడం, మాతా శిశు ఆరోగ్య సేవలు, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, ఇమ్యునైజేషన్‌ డ్రైవ్‌ల కోసం ఈ నిధులు వినియోగిస్తారు.  

రాష్ట్రం ఇవ్వాల్సింది ఇంకా రూ.56.35 కోట్లు 
ఎన్‌హెచ్‌ఎం కింద కేంద్ర నిధుల పంపిణీ రాష్ట్రాల జనాభా, ఆరోగ్య సూచికలు, పనితీరు ఆధారంగా ఉంటుంది. తెలంగాణ జనాభా సుమారు 3.93 కోట్లుగా అంచనా వేస్తే భారత దేశ జనాభా సుమారు 143 కోట్లు. అంటే దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.75 శాతం. 2024–25 కేంద్ర నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ బడ్జెట్‌ రూ. 36,000 కోట్లు. ఇందులో 2024–25లో కేంద్రం నుంచి రూ. 938.42 కోట్లు రావలసి ఉండగా, రూ.176.49 అదనంగా కలిపి రూ.1,114.91 కోట్లను విడుదల చేసింది. 

ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు రూ. 743.27 కోట్లు జమచేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 682.92 కోట్లు విడుదల చేసింది. మరో రూ.56.35 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కేంద్రం అదనంగా నిధులు ఇవ్వడంతో రాష్ట్రంలో మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించే అవకాశం ఉంది. 

2014–15 నుంచి కోతలే.. 
రాష్ట్రానికి ఎన్‌హెచ్‌ఎం కింద కేంద్రం ఇచ్చే వాటాలో 2014–15 నుంచి 2023–24 వరకు కోతలే ఉన్నాయి. ఏటా 10 నుంచి 40 శాతం వరకు బకాయిపెట్టింది. పదేళ్లలో రూ.7012.35 కోట్లు రావాల్సి ఉండగా, రూ.5,961.81 కోట్లు వచ్చాయి. రూ.1,050.54 కోట్లకు కేంద్రం కోతలు పెట్టింది. గత 11 ఏళ్లలో 2024–25 సంవత్సరంలోనే వాటా కంటే అదనంగా రూ.176.49 కోట్లు కేటాయించడం విశేషం.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు