Breaking News

లైఫ్‌ ట్యాక్స్‌ శ్లాబుల పెంపు

Published on Thu, 08/14/2025 - 00:58

సాక్షి, హైదరాబాద్‌: కొత్త వాహనాల కొనుగోలు సమయంలో చెల్లించే జీవితకాల పన్ను (లైఫ్‌ ట్యాక్స్‌) మొత్తాన్ని ప్రభుత్వం సవరించింది. వాహన ధరల ఆధారంగా ఇప్పటివరకు అమలులో ఉన్న శ్లాబులను పెంచటం ద్వారా వీలైనంత మేర పన్ను ఆదాయం పెరిగేలా నిర్ణయం తీసుకుంది. ఆ సవరింపునకు సంబంధించి నోటిఫికేషన్‌ ఉత్తర్వు జారీ చేసింది. 

ఇది గురువారం నుంచి అమలులోకి రానుంది. దీంతో పాటు వాహనాల ఫ్యాన్సీ నంబర్ల ధరలను కూడా భారీగా పెంచాలని నిర్ణయించింది. ఆ పెంపు మొత్తాన్ని వెల్లడిస్తూ అభ్యంతరాలుంటే  30 రోజుల్లోగా తెలపాల్సిందిగా నోటిఫికేషన్‌ జారీ చేయటం విశేషం. రవాణా శాఖ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే యత్నంలో ఉన్న ప్రభుత్వం.. ఇటీవలే రిజిస్ట్రేషన్‌ చార్జీలను సవరించిన విషయం తెలిసిందే.  
 
గతంలో 2..ఇప్పుడు 4 
వాహనాల ధరల ఆధారంగా పన్ను మొత్తాన్ని నిర్ధారించే శ్లాబులు అమలులో ఉంటాయి. ఉదాహరణకు ద్విచక్రవాహనాలకు సంబంధించి పరిశీలిస్తే.. ప్రస్తుతం వాహనం ధర రూ. 50 వేల లోపు, వాహనం ధర రూ.50 వేల కంటే ఎక్కువ.. ఇలా రెండు శ్లాబులు మాత్రమే అమలులో ఉన్నాయి. 

ఆ రెండు శ్లాబులకు నిర్ధారిత జీవితకాల పన్ను (వాహనం విలువలో నిర్ధారిత శాతం) కూడా ఖరారై ఉంది. తాజాగా వాహన ధర శ్లాబులను పెంచారు. వాహన విలువ రూ.50 వేల లోపు, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు , రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు, రూ.2 లక్షల కంటే ఎక్కువ.. ఇలా శ్లాబుల సంఖ్యను నాలుగుకు పెంచారు.    

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)