Breaking News

భర్త వివాహేతర సంబంధం తట్టుకోలేక..

Published on Sun, 11/08/2026 - 05:38

ఖానాపురం: ఇద్దరిది ప్రేమ వివాహం..ఆరేళ్లకాపురం..ఇద్దరు ఆడపిల్లలు. ఈ క్రమంలో భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం..చివరికి పిల్లలు, భార్యను వదిలి ఆ మహిళతో వెళ్లిపోవడం తట్టుకోలేక పాకాల సరస్సులో కూతుళ్లతో కలిసి తల్లి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం పాకాలలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీకి చెందిన ఈరెల్లి సుమన్, మమత(30)లు ఆరేళ్ల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. మెడికల్‌ డిప్లొమా చదివిన మమత నర్సంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తోంది. సుమన్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

వీరికి ఇద్దరు కూతుళ్లు హరిణి(4) కావ్యశ్రీ(3) జన్మించారు. దాంపత్యం సాఫీగా సాగుతున్న క్రమంలో సుమన్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరవై రోజుల క్రితం సుమన్‌ ఆ మహిళతో ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. దీంతో మమత హైదరాబాద్‌లో ఉన్న భర్తను తీసుకొచ్చి గీసుగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. మళ్లీ రెండు రోజుల క్రితం సదరు మహిళతో ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. ఈక్రమంలో సదరు మహిళ భర్త, బంధువులు మమత నివాసం ఉండే ఇంటి వద్దకు చేరుకొని భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు తీవ్ర దూషణలకు పాల్ప­డ్డారు.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మమత ఇద్దరు పిల్లలతో కలిసి పాకాల చెరువు వద్దకు శనివారం ఉదయం చేరుకుంది. ఎంట్రీ టికెట్‌ తీసుకుని పార్కులో పిల్లలతో కలి­సి కాసేపు గడిపింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని హైదరాబాద్‌లో ఉన్న బంధువులకు వాట్సాప్‌ ద్వారా లొకేషన్‌ వివరాలు పంపింది.

తన వెంట తెచ్చిన బ్యాగ్, సెల్‌ఫోన్‌ బోటింగ్‌ పాయింట్‌ సమీపంలో పెట్టి ఇద్దరు కూతుళ్లను తన చున్నీతో నడుముకు కట్టుకుని సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై గుగులోతు రాంమోహన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)