Breaking News

వదిన, భార్య, బిడ్డను చంపి ఆపై ఆత్మహత్య

Published on Mon, 11/03/2025 - 06:19

కుల్కచర్ల: కుటుంబ కలహాలు నలుగురి ప్రాణాలు బలితీసుకున్నాయి. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా కుల్క చర్ల మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేపూరి యాదయ్య (36)కు 15 ఏళ్ల క్రితం గండీడు మండలం పగిడ్యాలకు చెందిన సాయమ్మ, కృష్ణయ్య దంప తుల కుమార్తె అలి వేలుతో వివాహమైంది. వారికి అపర్ణ (13), శ్రావణి (10) కూతు ర్లు ఉన్నారు. అయితే దంప తులు నాలుగేళ్లుగా గొడవప డుతూ పెద్దల సూచనతో వైవాహిక బంధాన్ని కొనసా గిస్తున్నారు. శుక్రవారం మరో మారు గొడవపడ్డారు. ఈ క్రమంలో అలివేలు సోద రి వల్లభరావుపల్లికి చెందిన హన్మమ్మ శనివారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్ట గా వారు రాజీ కుదిర్చారు.

నిద్రలో ఉండగా దాడి 
ఇంటికి వచ్చిన యాదయ్య ముందస్తు ప్రణాళిక ప్రకారం భార్య, వదిన, పిల్లలు నిద్రించిన తర్వాత మొదట హన్మమ్మపై కత్తితో దాడి చేశాడు. ఆ శబ్దానికి నిద్రలోంచి లేచిన భార్యపై.. తదనంతరం మేము లేకుంటే మిమ్ముల్మి ఎవరు సాకుతారంటూ పిల్లలపై దాడి చేశాడు. దీంతో శ్రావణి మృతిచెందగా మరో కుమార్తె అపర్ణ తీవ్రంగా గాయపడి అక్కడి నుంచి పరారైంది. అనంతరం యాదయ్య సైతం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అపర్ణ స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్, కుల్కచర్ల ఎస్‌ఐ రమేశ్‌ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అలివేలు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)