Breaking News

గిరిజన మహిళపై హత్యాచారం

Published on Sun, 10/12/2025 - 04:39

మెదక్‌జోన్‌/కొల్చారం(నర్సాపూర్‌): ఏడుపాయల పుణ్యక్షేత్ర సమీపంలో ఘోరం జరిగింది. ఆలయానికి అతి సమీపంలోని ఓ వెంచర్‌ పక్కన ముళ్ల పొదల్లో గిరిజన మహిళపై అత్యాచారం చేశారు. ఆపై గుర్తుతెలియని దుండగులు తీవ్రంగా కొట్టడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది.

మెదక్‌ రూరల్‌ సీఐ జార్జ్, బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ మండలం సంగాయిగూడ తండాకు చెందిన గిరిజన మహిళ భర్త, పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. దంపతులిద్దరూ అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు. భర్త రెండు రోజుల క్రితం పని ఉండటంతో గజ్వేల్‌కు వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే ఆమె పనికోసం టిఫిన్‌ బాక్స్‌ పట్టుకొని ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కొడుకు తన తండ్రికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. 

ఇంటికి వచ్చిన భర్త తన భార్య కోసం అంతటా వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంతలోనే శనివారం ఉదయం 10 గంటల సమయంలో పోలీసుల ద్వారా విషయం తెలిసింది. ఘటనాస్థలిని మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌ సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. ఆ మహిళను వెంచర్‌లోని స్తంభానికి చేతులు కట్టేసి ఉంచగా, తలకు బలమైన గాయం, కుడిచేయి విరిగి ఉంది. మెడ, ఇతర చోట్ల గాయాలు ఉన్నాయి. వెంటనే పోలీసులు హుటాహుటిన మెదక్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

రాత్రి 7 గంటల వరకు చికిత్స అందిస్తున్నా స్పృహాలోకి రాలేదు. పరిస్థితి విషమించటంతో వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. వైద్యులు   గిరిజన మహిళపై అత్యాచారం చేసిన తర్వాతే దాడి చేసి ఉంటారని చెబుతున్నారు. ల్యాబ్‌కు శాంపిల్స్‌ పంపామని రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)