Breaking News

‘కుటుంబం’ కల చెదిరింది...

Published on Tue, 11/18/2025 - 06:13

కళ్లు తెరవకుండానే కడుపు లో కవలల మృతి చికిత్స పొందుతూ చనిపోయిన భార్య తట్టుకోలేక తనువు చాలించిన భర్త శంషాబా ద్‌లో విషాదకర ఘటన. మరికొద్ది రోజుల్లో ఓ అందమైన కుటుంబం ఆ తల్లి దండ్రుల ముందున్న కల.. కడుపులో ఉన్న కవ లలు మరికొద్ది రోజుల్లో తమ కుటుంబానికి కళ తీసుకొస్తారని ఆశించారు. అయితే వారి కల అంతా కొన్ని గంటల్లోనే చెదిరిపోయింది. కడుపులో ఉన్నకవలలు కళ్లు తెరవ కుండానే చనిపోయారు... ఆపై చికిత్స పొందుతూ భార్య మృతిచెందడంతో.. మన స్తాపంతో భర్త కూడా ఆత్మహత్యతో తనువు చాలించడంతో ఆ కల పీడకలగా ముగిసింది.

శంషాబాద్‌: కడప జిల్లా రైల్వేకోడూరికి చెందిన ముత్యాల విజయ్‌ (40) శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తూ భార్య శ్రావ్యతో కలిసి పట్టణంలోని సామ ఎనక్లేవ్‌లోని ఓ గదిలో ఏడాదిన్నరగా నివాసముంటున్నాడు. ఏడేళ్ల కిందటే వివాహం జరిగినా పిల్లలు కలగకపోవడంతో ఐవీఎఫ్‌ ద్వారా సంతాన భాగ్యానికి బాటలు వేసుకున్నారు. ఆదివారం రాత్రి 8 నెలల కడుపుతో ఉన్న శ్రావ్యకు కడుపునొప్పి రావడంతో ఆమె తల్లితో కలిసి అత్తాపూర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కడుపులో ఉన్న కవలలు చనిపోయారని తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మరికొద్ది సమయం తర్వాత శ్రావ్యకు కూడా మెరుగైన చికిత్స చేయాల్సిందిగా సూచించడంతో గుడిమల్కాపూర్‌లోని మైత్రి ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు అత్త సరోజిని విజయ్‌కు ఫోన్‌ చేసింది. విజయ్‌ అక్కడికి వెళ్లిన కొద్ది సమయంలోనే చికిత్స పొందుతూ శ్రావ్య కూడా మృతిచెందడంతో తీవ్ర మనస్తాపంతో శంషాబాద్‌లోని తన ఇంటికి వచ్చేశాడు. సోమవారం ఉదయం భార్యను తీసుకెళ్లడానికి భర్త సంతకం కావాలని ఆస్పత్రి యాజమాన్యం కోరడంతో వారి బంధువులు విజయ్‌కు ఫోన్‌ చేశారు. స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి గది తెరిచి చూసేసరికి విజయ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని విగత జీవిగా కనిపించాడు. మనస్తాపంతోనే తన తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని విజయ్‌ సోదరుడు ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)