Breaking News

యువతి శవంతో ప్రియుడి ఇంటిముందు ఆందోళన

Published on Mon, 12/29/2025 - 05:30

నారాయణఖేడ్‌: తమ కూతురు మృతికి ప్రేమికుడే కారణమంటూ యువతి శవంతో ప్రేమికుడి ఇంటి ముందు ఆమె కుటుంబీకులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం మునిగేపల్లి మాణిక్‌ నాయక్‌ తండాలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కంగ్టి సీఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. సిర్గాపూర్‌ మండలం కడ్పల్‌ విఠల్‌ నాయక్‌ తండాకు చెందిన వడిత్య కావేరి (23), నిజాంపేట మండలం మాణిక్‌ నాయక్‌ తండాకు చెందిన సభావత్‌ శ్రీకాంత్‌ (24)లు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి పెద్దలను ఆశ్రయించడంతో వారు నిరాకరించారు. దీంతో ప్రేమికులు హైదరాబాద్‌కు వెళ్లి జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం హైదరాబా ద్‌ శివార్లలోని బాలాపూర్‌ ప్రాంతంలో కావేరి తాము నివాసం ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మృతురాలి కుటుంబ సభ్యులు శనివారం అర్ధరాత్రి తమ కూతురు మృతికి ప్రేమికుడు శ్రీకాంతే కారణమంటూ మాణిక్‌ తండాలోని అతని ఇంటి ముందు కావేరి మృతదేహంతో ఆందోళనకు దిగారు.

ఆదివారం ఉదయం వరకు వారు అక్కడే బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సమాచారం తెలుసుకుని నారాయణఖేడ్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, కంగ్టి సీఐ వెంకట్‌ రెడ్డి, కల్హేర్‌ ఎస్‌ఐ రవిగౌడ్‌ల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం రెండు తండాలకు చెందిన పెద్దలు, ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడంతో కావేరి అంత్యక్రియలను శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులు నిర్వహించేందుకు మృతురాలి కుటుంబ సభ్యులు అంగీకరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)