పెళ్లికి ముందు భార్య వేరే వ్యక్తిని ప్రేమించిందని..

Published on Mon, 11/03/2025 - 06:24

పటాన్‌చెరు టౌన్‌: పెళ్లికి ముందు భార్య వేరే వ్యక్తిని ప్రేమించిందని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లాకు చెందిన రాములు (23) అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్‌పూర్‌ లో ఉంటూ స్థానికంగా ప్రైవేట్‌ స్కూల్లో బస్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నా డు. రాములుకు వికారాబాద్‌కు చెందిన ఓ యువతి (18)తో నెల కిందట వివాహం జరిగింది.

ఈ క్రమంలో అతను గతనెల 28వ తేదీన భార్యతో తాను పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి, నువ్వు ఎవ రినన్నా ప్రేమించావా? అని అడగడంతో అతని భార్య.. తాను కూడా ఒక వ్యక్తిని ప్రే మించానని చెప్పింది. దీంతో అప్పటి నుంచి ఆలోచిస్తూ.. మనస్తాపానికి గురైన రాములు శనివారం బయటకు వెళ్లొస్తానని చెప్పి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాములు కోసం వెతుకుతుండగా సుల్తాన్‌పూర్‌ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

పోలీసులు కొట్టడంతోనే నా భర్త మృతి? గోపి లాకప్ డెత్ పై సంచలన నిజాలు

దేవుడా..నా దొంగతనం సక్సెస్ కావాలి

విధుల్లో ఉన్న పోలీసుపై దాడి.. గోప్యంగా విషయం?

మాజీమంత్రి విడదల రజిని మానవత్వం.. గాయపడిన బాధితులకు తక్షణ సాయం

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

Photos

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)