Breaking News

గర్భిణిని పొట్టన పెట్టుకున్న భూతవైద్యం

Published on Sat, 07/18/2026 - 06:11

భద్రాచలం అర్బన్‌: అనారోగ్యంతో బాధపడుతున్న ఆరు నెలల గర్భిణిని భూతవైద్యుడిగా చెప్పుకునే వ్యక్తి వద్దకు తీసుకెళ్లారు. అతడు చేసిన మొరటు వైద్యంతో ఆమె ఆరోగ్యం విషమించింది. ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగానే మృతి చెందింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం, సుక్మా జిల్లా, కుంట మండలం, మారాయిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ కురసం హెన్కి (35)కి ఇటీవల మెడ, ముఖంపై వాపు వచ్చింది.

కుటుంబ సభ్యులు మంగళవారం నాడు ఆమెను ఆ గ్రామ సమీపంలోని భూత వైద్యుడు (ఆదివాసీలు వీరిని వెజ్జి, బుగ్గి వడ్డే, వడ్డే అని పిలుస్తారు)గా చెప్పుకునే వ్యక్తి వద్దకు తీసుకెళ్లారు. అతడు మెడ వాపు తగ్గిస్తానని హెన్కీ మెడపై పళ్లతో గట్టిగా కొరికాడు. ఆమె నొప్పితో విలవిల్లాడుతూ స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు, అతడి సూచనతో భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. 

ఐసీయూలో చికిత్స 
హాస్పిటల్‌కు వచ్చేటప్పటికే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు ఇన్‌ట్యూబేషన్‌ పద్ధతి ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ ఐసీయూలో చేర్చి వైద్యం మొదలుపెట్టారు. బుధవారంనాడు వైద్యులు ఆమె కోలుకుంటోందన్నారు. కానీ గురువారం అర్ధరాత్రి దాటాక ఆరోగ్యం విషమించి హెన్కీ మృతి చెందింది. ఆదివాసీల మూఢనమ్మకం ఓ గర్భిణిని పొట్టన పెట్టుకుంది. ఆమె కడుపులోని బిడ్డ లోకం చూడకుండానే కన్నుమూసింది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)