Breaking News

ఇఫ్తార్‌ విందులో.. ఖర్జూర నోరార

Published on Thu, 03/05/2026 - 18:19

రంజాన్‌ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు.. రుచి, ఆరోగ్యం, సంప్రదాయం, ఆధునికత కలిసే ఒక ప్రత్యేక జీవనశైలి. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి నగరంలో ఉన్న ఫుడ్‌ లవర్స్‌ రంజాన్‌ సీజన్‌ వచ్చిందంటే ఇఫ్తార్‌ టేబుల్స్‌ కొత్త ట్రెండ్స్‌తో మెరుస్తాయి. అయితే ఈ ఇఫ్తార్‌లో ఎన్ని వెరైటీలు ఉన్నా ఖర్జూరాలది మాత్రం ప్రత్యేక స్థానం. కేవలం రంజాన్‌ మాసం కోసం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన, రుచికరమైన ఖర్జూరాలను నగరానికి దిగుమతి చేసుకుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నగరంలో మరిన్ని వెరైటీల ఖర్జూరాలు సందడి చేస్తున్నాయి. వీటికి తోడు ట్రెడిషనల్‌ ఇఫ్తార్‌కు మోడ్రన్‌ టచ్‌ ఇచ్చే పానీయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ రెండింటినీ కలిపి చూస్తే ఈ ఏడాది రంజాన్‌ మాసం ఒకహెల్తీ లైఫ్‌ స్టైల్‌ స్టేట్‌మెంట్‌లా కనిపిస్తోంది.  – సాక్షి, సిటీబ్యూరో

రంజాన్‌ (Ramadan) మాసంలో ప్రతిరోజూ ఇఫ్తార్‌ విందులో ఖర్జూరాలు తొలి ముద్దగా తినడం తెలిసిందే.. ఈ ఖర్జూరాల్లో అంతర్జాతీయ ఆహార ప్రయాణం దాగుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనంగా పండించిన ఫలాల్లో ఒకటైన ఖర్జూరం.. ఇప్పుడు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఒక లగ్జరీ గిఫ్ట్, న్యూట్రిషనల్‌ పవర్‌హౌస్‌ కూడా. విభిన్న దేశాల నుంచి వచ్చే ఈ ఖర్జూరాలకు ప్రత్యేక ఆదరణ, దానికి తగ్గట్టుగానే రేట్లు సైతం ఉంటున్నాయి. ఇందులో భాగంగా దేశీయంగా పండించే భారతీయ ఖర్జూరం(ఖజూర్‌) నగరంలో సులభంగా లభ్యమవుతుంది. ఈ ఖర్జూరం ఫోనిక్స్‌ సిల్వెస్ట్రీస్‌ జాతికి చెందింది. దేశంలో రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో దొరికే ఈ ఖర్జూరం గట్టిగా, ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఈ రకం. ఫ్రెష్‌గా లేదా సన్‌–డ్రైడ్‌గా వీటిని వినియోగిస్తారు.  

సిటీలో ‘కింగ్‌ ఆఫ్‌ డేట్స్‌’ (King of Dates).. అధునాతన జీవనశైలికి కేంద్రమైన హైదరాబాద్‌లో ఏ దేశాలకు చెందిన ఉత్పత్తులైనా సులభంగా నగరానికి చేరుకుంటాయి. ఇదే క్రమంలో ‘కింగ్‌ ఆఫ్‌ డేట్స్‌’గా పిలుచుకునే మొరాకో నుంచి వచ్చే మెడ్జూల్‌  ఖర్జూరం (Medjool dates )  పెద్ద పరిమాణంలో, అంబర్‌ బ్రౌన్‌ కలర్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. కారమెల్, టాఫీ, హనీ నోట్స్‌తో నిండిన ఈ రకం గిఫ్టింగ్‌కు హాట్‌ ఫేవరెట్‌. సిటీలో ప్రీమియం డ్రైఫ్రూట్‌ స్టోర్లలో దీని డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. హనీ టచ్‌తో సాఫ్ట్‌ డిలైట్‌గా ఉంటే. సౌదీ అరేబియాలో పండే సుక్కరి ఖర్జూరం కూడా నగరంలోని ముస్లింలు అమితంగా ఇష్టపడతారు. ఇవి మృదువుగా, తక్కువ ఫైబర్, 
సహజమైన తేనె రుచితో ఉంటాయి. రంజాన్‌ గిఫ్ట్‌ హ్యాంపర్లలో ఇది తప్పనిసరి ఐటమ్‌.  

ఈ రకం తాజాగా ఉన్నప్పుడు గోల్డెన్‌ యెల్లో, పండినప్పుడు అంబర్‌ బ్రౌన్‌గా మారుతుంది. సహజ చక్కెర ఎక్కువగా ఉండటంతో ఎనర్జీ బూస్టర్‌గా వీటిని పరిగణిస్తారు. అల్జీరియా, ట్యునీషియా ప్రాంతాల నుంచి వచ్చే డెగ్లట్‌ నూర్‌ రకాన్ని ‘క్వీన్‌ ఆఫ్‌ డేట్స్‌’గా పిలుస్తారు. ఈ రకం పాక్షికంగా ఎండిపోయి, నట్టి స్వీట్‌నెస్‌తో ఉంటుంది. బేకింగ్, కుకింగ్‌కు ఇవి అద్భుతంగా సరిపోతాయి. రంజాన్‌ డెజర్ట్స్‌లో ఇది ఫేవరెట్‌. ఇరాన్‌ నుంచి వచ్చే మజాఫతి ఖర్జూరం డార్క్‌ బ్రౌన్‌ నుంచి నలుపు రంగులో ఉంటుంది. సాఫ్ట్, జ్యూసీ టెక్స్చర్‌తో మోలాసిస్‌ లాంటి రుచి దీని ప్రత్యేకత. సౌదీ అరేబియా మదీనాలో మాత్రమే దొరికే అజ్వా రకానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎక్కువ. ఈ ఖర్జూరం మతపరమైన, సాంస్కృతిక విలువలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది ప్రీమియం కేటగిరీలోకి వస్తుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)