Breaking News

Hyderabad: 3 లక్షల 3 వేల గణేష్‌ విగ్రహాల నిమజ్జనం

Published on Mon, 09/08/2025 - 10:45

లక్డీకాపూల్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా జరిగిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు గ్రేటర్‌ వ్యాప్తంగా 3 లక్షల 3 వేల గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేశారన్నారు. పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది, పోలీస్, విద్యుత్, హెచ్‌ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్‌ అభినందనలు తెలిపారు. పారిశుద్ధ్యం, విద్యుత్‌ సౌకర్యంతోపాటు టాయిలెట్లు, సరిపడా క్రేన్ల ఏర్పాటు తదితర అంశాల్లో జీహెచ్‌ఎంసీ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. 

నిమజ్జనం మార్గం పొడవునా ఏర్పాటు చేసిన గణేశ్‌ యాక్షన్‌ టీమ్స్‌ రోడ్లపై చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో ఫలితం కనిపించింది. రోడ్డు సేఫ్టీ డ్రైవ్‌లో నగరంలోని రోడ్లకు మరమ్మతులు చేపట్టడం, ప్రధానంగా నగరంలో ఖైరతాబాద్‌ మహా గణపతి, బాలాపూర్‌ గణేష్‌లతో సహా నిమజ్జన శోభాయాత్ర జరిగే 303 కిలోమీటర్ల మేర మార్గం మరమ్మతులు చేపట్టడంతో ఊరేగింపు సాఫీగా, సురక్షితంగా, వేగంగా జరిగిందని పేర్కొన్నాన్నారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తూ 15 వేల మంది సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో మూడు షిఫ్టులో విధులు నిర్వర్తించడంతో పారిశుధ్య నిర్వహణలో ఇబ్బందులు కనిపించలేదన్నారు.

 72 కృత్రిమ కొలనులతో ప్రధాన చెరువులపై ఒత్తిడి లేకుండా, ట్రాఫిక్‌ జామ్‌లు లేకుండా, భక్తులు స్థానికంగానే నిమజ్జనం అయ్యేలా చూడగలిగామన్నారు. జీహెచ్‌ఎంసీ కల్పించిన ఉచిత భోజన సౌకర్యం భక్తులు, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కారి్మకుల సేవలను మేయర్, కమిషనర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రÔ¶ ంసించారు.. వారి నిరంతర సేవల వల్లే ఇప్పటి వరకూ 20 వేల అధిక టన్నుల వ్యర్థాలను సేకరించినట్లు తెలిపారు. ఈ వ్యర్థాలను జవ జవహర్‌ నగర్‌ లోని ప్రాసెసింగ్‌ సెంటర్‌కు పంపామన్నారు. 

గణేష్‌ ఉత్సవసమితి సభ్యులు, మీడియా, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు 
వినాయక చవితి ఉత్సవం, మహా నిమజ్జనం కార్యక్రమం సజావుగా జరిగేలా యంత్రాంగానికి తమవంతు సహకారం అందించిన గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు, మీడియా, ప్రజలకు మేయర్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ కర్ణన్‌ కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్‌ఎంసీ యంత్రాగం, ప్రభుత్వ శాఖలు చేసిన ఏర్పాట్లను, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా క్రియాశీలంగా వ్యవహరించిందని ఆదివారం ఒక ప్రకటనలో కొనియాడారు.  

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)