Breaking News

నల్గొండ ఇంటలిజెన్స్‌ ఎస్పీ కవితపై వేటు

Published on Sat, 01/11/2025 - 10:40

నల్గొండ, సాక్షి: జిల్లా ఇంటెలిజెన్స్‌ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణల మీద ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఆమె భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.  

ఆమె అవినీతి(Corruption)పై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆ అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్‌ విభాగంలో పోస్టింగ్‌ల కోసం లంచం వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సైతం చేయించినట్లు లేఖలో తెలిపారు.  దీని ఆధారంగా అధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. 

నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్‌ అధికారిగా గంజి కవిత(Ganji Kavitha) ఏడేళ్లు పని చేశారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్‌, గుట్కా మాఫియాల నుంచి భారీగా ఆమె వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సొంత సిబ్బందిని ఆమె వదల్లేదని తేలింది. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు సమాచారం. దీంతో ఆమె షాడో టీంపైనా విచారణ కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్‌ చేసే అవకాశం ఉంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)