Breaking News

అద్భుతమైన ప్రకృతిని.. చిన్న ప్రదేశంలో చూపించే 'ఇకబెనా ఆర్ట్‌'.. ఇది!

Published on Thu, 08/01/2024 - 13:03

సాక్షి, సిటీబ్యూరో: అద్భుతమైన ప్రకృతిని చిన్న ప్రదేశంలో చూపించే ఇకబెనా ఆర్ట్‌కు జపాన్‌లో మంచి ఆదరణ ఉంది. దీనికి నగరంలోనూ ఆదరణ పెరుగుతోంది. ది ఒహరా స్కూల్‌ ఆఫ్‌ ఇకబెనా హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో 35 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా బుధవారం పార్క్‌ హోటల్‌లో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విభిన్నమైన పూలు, ఆకులు ఇతర వస్తువులతో ఇకబెనా శైలిని ప్రదర్శించారు.

ఇందులో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హోజుకి ఒయామాడ చేసిన పూల అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారత దేశంలోనూ ఇకబెనా కోర్సు ఆదరణ పొందుతోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జపాన్‌ గౌరవనీయమైన కాన్సుల్‌ జనరల్‌ తకాహషి మునియో దంపతులు, హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్‌పర్సన్‌ రేఖారెడ్డి, ప్రెసిడెంట్‌ నిర్మలా అగర్వాల్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఇందుమతి దావ్లూర్, శారద, జ్యోత్స్న, నందరావు, శశి కోలా, రేఖా బయాంకర్, మీనాక్షి సుజనని, కనకదుర్గ, నిరూప తదితరులు భాగమయ్యారు.

మేకింగ్‌ స్కిల్స్‌ బాగుంటాయి.. 
హైదరాబాద్‌లో ఇకబెనా ఎగ్జిబిషన్‌ ఎక్కడున్నా హాజరువుతా.. క్రియేటివిటీ, ఫ్లవర్‌ డెకరేషన్‌ వాటి నిర్వహన చాలా బాగుంటుంది. ఈ కోర్సు నేర్చుకోవాలంటే అధునాతన జీవన శైలిపై అవగాహన ఉండాలి. సొంతగా ఇల్లు, కంపెనీని అందంగా అలంకరించుకుంటాను. గార్డెన్‌ను సైతం మొక్కలు, రంగురంగుల పూలతో అందంగా తయారు చేసుకుంటాను. – జీవీఎస్‌ రామారావు, పారిశ్రామికవేత్త, మల్లాపూర్‌.

అరుదైన కళ.. 
పెయింటింగ్, సింగింగ్, నృత్యం వంటి కళల్లాగే ఇకబెనా కూడా అరుదైన కళ. ఈ స్కూల్‌కు జపాన్‌లో మంచి గుర్తింపు ఉంది. మనం జపాన్‌ వెళ్లలేం.. కానీ ఆయా నిపుణులను నగరంలో కలుసుకోవడం మరిచిపోలేని అనుభూతి. పదేళ్ల నుంచి ఇందులో భాగమయ్యాను. ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం పొందాలంటే దీని లోతైన విశిష్టత అవగతమవ్వాలి.  – చిలుకూరి అన్నపూర్ణ, హైదరాబాద్‌.

ఏకాగ్రతతోనే సాధ్యం.. 
ఇకబెనా వినూత్నమైన కోర్సు. ఒహారా స్కూల్‌ ఆఫ్‌ ఇకబెనా ఫ్లవర్‌ డెకరేషన్‌ చేసే వ్యక్తికి కలర్‌ కాంబినేషన్‌పై మంచి పట్టుండాలి. సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను ప్రదర్శించగలగాలి. మేమంతా ఎంతో ఇష్టంతో చేస్తున్నాం. దీన్ని ప్రొఫెషన్‌గా తీసుకుని స్కూల్‌ నడిపిస్తున్న వారు ఇందులో ఉన్నారు. – నీరజ గోదావర్తి, హైదరాబాద్‌

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు