CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు
Breaking News
తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ
Published on Fri, 10/31/2025 - 18:53
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిదిమంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈమేరకు ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సబ్యసాచి ఘోష్.. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు.. ఈయనే వెల్ఫేర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్.. వెల్ఫేర్ విభాగం కార్యదర్శి, గిరిజన సంక్షేమ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శిగా ఉన్న ఇలంబర్తి.. ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.
బీసీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీధర్.. జీడీఏ పొలిటికల్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.
హార్టికల్చర్ & సిరికల్చర్ డైరెక్టర్‌గా ఉన్న షేక్ యస్మీన్ బాషా.. ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శిగా రామకృష్ణ రావు కొనసాగుతారు
జితేందర్ రెడ్డి ఎస్సీ డెవలప్‌మెంట్ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శిగా ఉన్న సైదులు.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
Tags : 1