Breaking News

టీఎస్పీఎస్సీ కార్యదర్శి బదిలీ

Published on Mon, 02/05/2024 - 01:39

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆమెస్థానంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ను నియమించారు. వీరితోపాటు పలు వురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆది వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మత్స్యశాఖ డైరెక్టర్‌గా ఉన్న లచ్చిరాంభూక్యను ప్రభుత్వం బాధ్యతల నుంచి రిలీవ్‌ చేస్తూ కేంద్ర సరీ్వసులకు తిప్పి పంపించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఉన్న బి.గోపికి ఫిషరీస్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.  

► హైదరాబాద్‌ జిల్లా చీఫ్‌ రేషనింగ్‌ అధికారి బి.బాలమాయాదేవి బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా,  
► రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.హనుమంతరావును రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్‌ ఆఫీషియో సెక్రటరీగాను  
► సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ కె. అశోక్‌రెడ్డిని ఉద్యానవనశాఖ డైరెక్టర్‌గా క్రిస్టియన్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎ.నిర్మలకాంతి వెస్లీని స్త్రీ, శిశు, వయోజనుల సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ, ఆమెకే ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ పోస్టును సైతం ప్రభుత్వం అప్పగించింది.  

► హైదరాబాద్‌ జూ పార్క్‌ డైరెక్టర్‌గా ఉన్న విఎస్‌ఎన్‌వి.ప్రసాద్‌కు పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌ నియమించింది.  
► వెయిటింగ్‌లో ఇద్దరిలో సీతాలక్ష్మిని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ, తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీల కార్యదర్శిగాను, జి.ఫణీంద్రరెడ్డికి హైదరాబాద్‌ జిల్లా రేషనింగ్‌ అధికారిగా బదిలీ చేసింది.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)