Breaking News

‘కాళేశ్వరం’పై ఐఏఎస్‌ల విచారణ!

Published on Mon, 07/15/2024 - 03:37

సాక్షి, హైదరాబాద్‌:  కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లపై చేపట్టిన విచారణలో భాగంగా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ సోమవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని తమ కార్యాలయంలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లు, రిటైర్డ్‌ ఐఏఎస్‌లను ప్రశ్నించనుంది. 

సోమవారం విచారణకు రావాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి రిటైరైన సోమేశ్‌కుమార్, ఎస్‌కే జోషీ, ఆర్థిక శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి, ఆ శాఖ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి రజత్‌కుమార్, మాజీ సీఎం కేసీఆర్‌ కార్యదర్శిగా పనిచేసిన స్మిత సబర్వాల్‌లకు సమన్లు జారీ చేసింది. 

ఇప్పటివరకు నిర్మాణ, సాంకేతిక అంశాలపై వివరాలు సేకరించిన చేసిన కమిషన్‌.. ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలపై దృష్టిపెట్టిందని, ఈ క్రమంలోనే అనుమతుల జారీ, అంచనా వ్యయాల పెంపు, నిధుల విడుదలలో పాత్ర ఉన్న ఐఏఎస్‌లను విచారించనుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. 

నిర్మాణ సమయంలో ఉన్నవారిని.. 
తెలంగాణ ఏర్పాటయ్యాక సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్‌కే జోషి పనిచేశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనా నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్‌చార్జి బాధ్యతల్లో కొనసాగారు. ఆయన హయాంలోనే కాళేశ్వరంప్రాజెక్టుకు సంబంధించిన చాలా నిర్ణయాలు తీసుకున్న నేపత్యంలో.. కమిషన్‌ ఆయనను విచారణకు పిలిచింది. 

ఎస్‌కే జోషి రిటైరైన తర్వాత కొన్ని నెలల పాటు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్‌చార్జి బాధ్యతల్లో సోమేశ్‌కుమార్‌ వ్యవహరించడంతో ఆయనను కూడా విచారణకు రావాలని ఆదేశించింది. ఇక మాజీ సీఎం కేసీఆర్‌ కార్యదర్శిగా స్మిత సబర్వాల్‌ దాదాపుగా తొమ్మిదిన్నరేళ్లపాటు పనిచేశారు. సీఎం కార్యదర్శి హోదాలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించిన నేపథ్యంలో.. ఆమెను కమిషన్‌ విచారించనుంది. 

ప్రస్తుతం ఆమె రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రుణాల సమీకరణ, బడ్జెట్‌ కేటాయింపులు, బిల్లుల చెల్లింపులో పాత్ర నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ వి.నాగిరెడ్డి, ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కమిషన్‌ విచారణకు రమ్మని కోరింది. 

నేడు కమిషన్‌కు కె.రఘు ప్రజెంటేషన్‌ 
ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌ల విచారణ సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. తర్వాత కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విద్యుత్‌ రంగ నిపుణుడు కె.రఘు మధ్యాహ్నం 2.30 గంటలకు కమిషన్‌కు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలు, అవకతవకతలపై సాక్ష్యాధారాలను సేకరించడానికి ఆయనను కమిషన్‌ విచారణకు పిలిచింది. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)