స్పా ముసుగులో వ్యభిచారం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, అనూష కలిసి..

Published on Sat, 06/07/2025 - 08:03

అమీర్‌పేట: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మూడు స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. బీకే గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో సీసీఎస్‌ యాంటీ ట్రాఫికింగ్‌ వింగ్‌ పోలీసులు శుక్రవారం దాడులు చేశారు.

యూసుఫ్‌గూడకు చెందిన స్పా సెంటర్‌ నిర్వాహకురాలు నడిమింటి అనూష, కార్మికనగర్‌కు చెందిన విటుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వినయ్‌బాబుతో పాటు ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. అదే విధంగా అమీర్‌పేట విఠల్‌ చాంబర్స్‌లోని 2వ అంతస్తులో గ్లోరీ ఫిజియోథెరపీ హాస్పిటాలిటీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. బోరబండకు చెందిన స్పా సెంటర్‌ యజమాని టి.కళ్యాణి, ఐడీపీఎల్‌ చింతల్‌కు చెందిన అశోక్‌కుమార్, మియాపూర్‌ నివాసి సాంబశివరెడ్డితో పాటు నలుగురు మహిళలను అరెస్టు చేశారు.

అమీర్‌పేట గురుద్వారా సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ఎన్‌.ఎస్‌.బ్యూటీ సెలూన్‌ ఆండ్‌ స్పా సెంటర్‌లో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆదిలాబాద్‌కు చెందిన నిర్వాహకురాలు సుధ, వెస్ట్‌ గోదావరికి చెందిన విటుడు సాగిరాజు దినేష్‌ వర్మ, వరంగల్‌కు చెందిన గౌతమ్, కుత్బుల్లాపూర్‌ నివాసి రవికుమార్, బంజారాహిల్స్‌కు చెందిన చవన్‌ సురేందదర్, గుంటూరుకు చెందిన పిన్ని ప్రవీణ్‌ కుమార్, వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన ఒక యువతిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసులను ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)