Breaking News

ట్రిపుల్‌ ఆర్‌కు కేంద్రం ఆమోదం.. సంక్షోభాలకు తావు లేకుండా ‘క్యూర్‌’ 

Published on Mon, 12/01/2025 - 01:23

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపలి ప్రాంతాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయడానికి ఆ ప్రాంతాన్ని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌)గా విభజించామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక, మూసీ, పాత వాహనాల కాలుష్యాన్ని నిర్మూలించి నెట్‌ జీరో సిటీగా రూపాంతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు కాలుష్యం, వరదలు, శాంతిభద్రతల వంటి సమస్యలతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయంటూ.. తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలకు తావులేకుండా ‘క్యూర్‌’ చేయాల్సిందేనని సీఎం వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా డిసెంబర్‌ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణ, సమ్మిట్‌లో ఆవిష్కరించనున్న తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌–2047 తయారీపై ఆదివారం సచివాలయంలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  

లక్షలాది మంది భాగస్వామ్యంతో డాక్యుమెంట్‌ 
‘తెలంగాణ ముఖచిత్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా క్రోడీకరించి తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌–2047 తెస్తున్నాం. అందులో మహిళలు, యువత, రైతులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలను దృష్టిలోపెట్టుకుని రూపొందించిన ప్రణాళికలుంటాయి. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్‌ ప్రణాళికగా మార్చుకుని, 4  కోట్ల తెలంగాణ ప్రజలకు అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని అందించడంలో భాగంగా పారదర్శకమైన పాలసీ డాక్యుమెంట్‌ను జాతికి అంకితం చేయబోతున్నాం. ప్రపంచ దేశాల్లోని దిగ్గజ కంపెనీలు మన యువ సంపదకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిపిస్తే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. దీంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెవేర్చగలుగుతాం. 

ఈ డాక్యుమెంట్‌లో విజన్, స్ట్రాటజీ అనే రెండు ప్రధాన అంశాలుంటాయి. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్‌ (ని్రష్కియాత్మకత) నెలకొంటే పెట్టుబడులకు రక్షణ ఉండదు. రాష్ట్ర భవిష్యత్తుకు నష్టం చేకూరుతుంది. ప్రపంచ స్థాయి నిపుణులు, ఐఎస్‌బీ, నీతి ఆయోగ్‌తో పాటు లక్షలాది మందిని భాగస్వాముల్ని చేసి డాక్యుమెంట్‌ తయారు చేశాం. స్ట్రాటజీలో భాగంగా రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించాం. యూపీఏ చైర్‌ పర్సన్‌గా సోనియాగాం«దీ, సీఎంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉన్నప్పుడు ఓఆర్‌ఆర్‌), అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును నిర్మించుకున్నాం. ఇప్పుడు ఓఆర్‌ఆర్‌ లోపలున్న 2,170 చదరపు కి.మీల పరిధిలోని ‘క్యూర్‌’  ఏరియాను సర్వీస్‌ సెక్టార్‌ జోన్‌గా మార్చి జీసీసీ, ఐటీ రంగ పరిశ్రమలను ప్రోత్సహిస్తాం. ఇక్కడి నుంచి కాలుష్యకారక పరిశ్రమల తరలిస్తాం. చెరువులు, కుంటలు, నాలాల ప్రక్షాళన చేపడతాం. మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి, రోడ్ల విస్తరణ చేపడతాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

ట్రిపుల్‌ ఆర్‌కు కేంద్రం ఆమోదం 
‘ఓఆర్‌ఆర్‌ బయట రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఓఆర్‌ఆర్‌ 162 కి.మీ పొడవుతో ఉండగా, 320 కి.మీల పొడవుతో రానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ నగరానికి రెండో మణిహారంగా మారబోతోంది. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ఉన్న ప్రాంతాన్నే పెరీ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (ప్యూర్‌)గా విభజించి అభివృద్ధిపరచబోతున్నాం. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి పెట్టుబడులు రావడానికి అవసరమైన ప్రణాళికలు ప్యూర్‌ పాలసీలో ఉంటాయి. బెంగళూరు–హైదరాబాద్, హైదరాబాద్‌–అమరావతి, అమరావతి–చెన్నైల మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేల నిర్మాణంతో పాటు బుల్లెట్‌ ట్రెయిన్‌ ఏర్పాటుకు కేంద్రాన్ని సూత్రప్రాయంగా ఒప్పించాం. 

ప్యూర్‌ జోన్‌ను మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించి ఇక్కడి ఉత్పత్తుల దిగుమతికి ప్రోత్సహిస్తాం. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడుగా వరగంల్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండంలో కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తాం. హైదరాబాద్‌–మచిలీపట్నం మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి ప్రధాని, ఏపీ సీఎంతో మాట్లాడగా అంగీకరించారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ బయటి ప్రాంతాన్ని రూరల్‌ అగ్రికల్చర్‌ రీజియన్‌ ఎకానమీ (రేర్‌)గా విభజించి అభివృద్ధి చేస్తాం..’ అని రేవంత్‌ చెప్పారు.   

100 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల నాటికి.. 
‘మాకు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, తమిళనాడు పోటీ కాదు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్‌తోనే పోటీ. వాటినే ఆదర్శంగా తీసుకుంటాం. ఆయా దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తాం. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. అంతర్జాతీయ విద్యా సంస్థలను తీసుకొచ్చి నాలెడ్జ్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తాం. 2047లో దేశం 100 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల జరుపుకునే సమయంలో 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రం వాటాను 5 నుంచి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం..’ అని సీఎం వెల్లడించారు. కాగా మంత్రులతో కలిసి గ్లోబల్‌ సమ్మిట్‌ ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.శ్రీదర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, అజహరుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.  

ప్రజా పాలన ఉత్సవాలకు సీఎం 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా డిసెంబర్‌ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలను నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 1న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌లో, 2న ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో, 3న కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో, 4న ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో, 5న వరంగల్‌ జిల్లా నర్సంపేటలో, 6న నల్లగొండ జిల్లా దేవరకొండలో నిర్వహించనున్న ఉత్సవాల్లో సీఎం రేంవత్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. స్థానిక జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారన్నారు. కాగా 7వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు విద్యా వ్యవస్థ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటిస్తారని భట్టి తెలిపారు. 8, 9వ తేదీల్లో గ్లోబల్‌ సమ్మిట్‌ ఉంటుందన్నారు. 

గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను 8న సీఎం వివరిస్తారని, 9న తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌–2047ను ఆవిష్కరిస్తారని చెప్పారు. సాధారణ ప్రజానీకం సందర్శన కోసం 10, 11, 12వ తేదీల్లో సైతం సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కొనసాగిస్తామన్నారు. ఇక ఉత్సవాల చివరి రోజు 13న ఫుట్‌బాల్‌ దిగ్గజం లయనల్‌ మెస్సీ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడతారన్నారు. ఇలావుండగా..విజన్‌ డాక్యుమెంట్‌–2047 తయారీలో భాగంగా 4 లక్షల మంది ప్రజల అభిప్రాయాన్ని సేకరించామని, రాష్ట్ర జనాభాలో ఇది ఒక శాతమని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.   

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)