Breaking News

పెట్స్‌కు బీమా.. యజమానికి ధీమా

Published on Mon, 01/23/2023 - 01:37

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణప్రదంగా పెంచుకున్న పెంపుడు జంతువులకు బీమా కల్పించడం ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగింది.  ఆపదలో ఉన్న పెట్స్‌కు బీమా రూపంలో ఆపన్న హస్తం అందించేందుకు నగరవాసులు అమితాసక్తి చూపుతున్నారు. ఇటీవలికాలంలో సంపన్న వర్గాలతోపాటు ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతికి చెందిన వారు కూడా తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకోవడంపై మక్కువ చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో వివిధ జాతులకు చెందిన కుక్కలు, పిల్లులు, పక్షులకు బీమా సౌకర్యం కల్పించేందుకు పలు ఇన్సూరెన్స్‌ కంపెనీలు ముందుకొస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలో ఇటీవల వేలాది జంతువులకు ఇలాంటి భరోసా కల్పించినట్లు బీమా కంపెనీలు చెబుతున్నాయి. సాధారణ అనారోగ్యం మొదలు చిన్నపాటి సర్జరీలు, కేన్సర్, గుండెజబ్బుల వంటి ప్రమాదకర వ్యాధుల చికిత్సలకు సైతం డబ్బు­లు చెల్లిస్తారు. వ్యాక్సినేషన్, డీవార్మింగ్, టిక్‌ట్రీట్‌మెంట్, డాక్టర్‌ విజిట్‌ వంటివి కూడా బీమా పరిధిలోకి రావ డం విశేషం. ఒకవేళ ఆ పెట్‌ ఆకస్మికంగా మరణించినా యజమానికి బీమా మొ త్తాన్ని చెల్లించే కంపెనీలు కూడా ఉన్నాయి.  

నెలకు రూ.122 నుంచి 500 వరకు.. 
సాధారణంగా ఇళ్లలో పెంచుకునే శునకాల జీవితకాలం సుమారు 12 ఏళ్లు ఉంటుంది. అయితే బీమా కంపెనీలు రెండు నెలల నుంచి 8 ఏళ్ల మధ్య వయసున్న కుక్కలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు బీమా సదుపాయం కల్పి­స్తున్నాయి. ఇందుకోసం పెట్స్‌ యజమానులు నెలకు రూ.122 నుంచి 500 వరకు ప్రీమియంగా చెల్లిస్తున్నారు.

పెంపుడు జంతువులకు అనారోగ్యానికి నెలకు రూ.8 వేల నుంచి 10 వేల వరకు ఖర్చు చేస్తున్న వారికి ఈ బీమా ఆర్థికంగా బాగా కలిసివస్తుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. పెట్స్‌కు చికిత్సకయ్యే ఖర్చులో 80 శాతం వరకు కంపెనీ చెల్లిస్తుంది. కేన్సర్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు తదితర ప్రమాదకర వ్యాధుల సర్జరీలకు సుమారు రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈ చికిత్సలు కూడా బీమా పరిధిలోకి వస్తాయి.  

ముందుకొస్తున్న కంపెనీలు.. 
పెట్స్‌కు బీమా సౌకర్యం కల్పిస్తున్న వాటిలో పాటెక్టో వెటీనా హెల్త్‌కేర్‌ ఎల్‌ఎల్‌పీ, న్యూ ఇండియా అస్యూరెన్స్, పావ్‌ ఇన్సూరెన్స్‌ తదితర కంపెనీలున్నాయి. ఈ బీమా వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఇతర కంపెనీలు సైతం ఈ రంగంలోకి వస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. నగరంలో పెట్స్‌ను విక్రయించే దుకాణాలు, వాటికి అవసరమైన ఆహారం, మందులు అందించే సంస్థలు సైతం బాగా విస్తరించాయి. ఇదే క్రమంలో బీమా సదుపాయం రావడంతో పెంపుడు జంతువుల బతుకులకు భరోసా లభిస్తోందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. 

పెట్స్‌ బీమా అత్యవసర జాబితాలోకి.. 
ఇçప్పుడు పెట్స్‌ ఇన్సూరెన్స్‌ కూడా అత్యవసర జాబితాలోకి చేరింది. హెల్త్‌కేర్, సర్జరీ వంటివి యజమానికి భారం కాకుండా పలు బీమా కంపెనీలు పాలసీలు ఇస్తున్నాయి. ఎక్కువ మంది నగరవాసులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు.     
–డాక్టర్‌ ఎం.అరుణ్‌కుమార్, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్, సరూర్‌నగర్‌ ప్రైమరీ వెటర్నరీ సెంటర్‌  

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)