Breaking News

ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హబ్‌గా హైదరాబాద్‌

Published on Sat, 12/20/2025 - 04:19

సాక్షి, హైదరాబాద్‌: సినిమాలపరంగా హైదరాబాద్‌ ప్రొడక్షన్‌ హబ్‌గా మారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నగరంలోని ప్రసాద్‌ మల్టీ ప్లెక్స్‌లో శుక్రవారం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ ఫిల్మ్‌ డెవల ప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నగరంలో మొదటిసారి ప్రారంభించిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగ అభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌ అంతర్జాతీయస్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, ఇక్కడ నిర్వహించే ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. భారత్‌ నుంచే కాకుండా స్పెయిన్, ఈజిప్ట్, యూకే, యూఎస్‌ఏ, సౌత్‌ కొరియా వంటి దేశాల నుంచి మొత్తంగా 704 చిత్రాలు ఎంట్రీలుగా రావడం అభినంద నీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రియాంక, దర్శకులు ఉమామహేశ్వరరావు, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)