Breaking News

పాతబస్తీలో కొత్త మార్గం

Published on Sat, 10/04/2025 - 08:10

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలోని ఫలక్‌నుమా జంక్షన్‌ (జీమ్యాక్స్‌ కన్వెన్షన్‌) నుంచి ఫలక్‌నుమా బస్‌డిపోతో పాటు చార్మినార్ వరకు వెళ్లే వారికి ఇప్పటిదాకా ఉన్న ట్రాఫిక్‌ చిక్కులు తగ్గనున్నాయి. సికింద్రాబాద్‌ –ఫలక్‌నుమా బ్రాడ్‌గేజ్‌ లైన్‌లోని ఫలక్‌నుమా వద్ద  ఇప్పటికే ఉన్న ఆర్‌ఓబీకి సమాంతరంగా రూ. 52.03 కోట్లతో నిర్మించిన కొత్త ఆర్‌ఓబీని హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుక్రవారం ప్రారంభించారు. 

పాత ఆర్‌ఓబీ పునరుద్ధరణతో పాటు కొత్త ఆర్‌ఓబీని నాలుగు వరుసల క్యారేజ్‌వేతో నిర్మించడంతో బార్కాస్‌ జంక్షన్‌ నుంచి ఫలక్‌నుమా బస్‌ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్‌ వైపు వెళ్లే వాహనాలకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఎంతో  సమయం ఆదాతో కావడంతో పాటు గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్‌ నుంచి ఉపశమనం  లభించనుంది.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్సీలు మీర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ ఎఫెండీ, మీర్జా రహమత్‌ బేగ్‌ , ఎమ్మెల్యేలు మహమ్మద్‌ ముబీన్, మీర్‌ జలి్ఫకర్‌ అలీ, మేయర్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు. తొలుత ఈ ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని ప్రకటించినప్పటికీ, ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదు.  

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)