Breaking News

దేశమంతా...‘దక్కన్‌ చాయ్‌’

Published on Sat, 06/22/2024 - 07:52

సాక్షి, హైదరాబాద్‌: విభిన్న రుచుల చాయ్‌లున్నా హైదరాబాద్‌ చాయ్‌ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. టీ కొట్టు నుంచి స్టార్‌ హోటళ్ల వరకూ హైదరాబాద్‌ ఫ్లేవర్‌ చాయ్‌కు ప్రత్యేక ఆదరణ ఉంది. ఈ హైదరాబాదీ చాయ్‌ను విశ్వవ్యాప్తం చేయనున్నామని, మొదట దక్షిణాది రాష్ట్రాలకు పరిచయం చేయనున్నామని ప్రముఖ శ్రేయాస్‌ గ్రూప్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇప్పటికే సినిమా, ఈవెంట్, ఫ్యాషన్‌ రంగాల్లో తమదైన గుర్తింపు పొందిన శ్రేయాస్‌ గ్రూప్‌ ‘దక్కన్‌ చాయ్‌’తో మార్కెట్‌లోకి ప్రవేశించింది. 

దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని శుక్రవారం బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ఏర్పాటు చేశారు.  దేశంలో చాయ్‌ వ్యాపారం 11 వేల మిలియన్‌ డాలర్ల మార్కెట్‌కు కలిగి ఉందని, మరో పదేళ్లలో ఇది 18 వేల మిలియన్‌ డాలర్లకు చేరుకోనుందని తెలిపారు.   ఇందులో హైదరాబాదీ చాయ్‌ను మరింత ప్రాచూర్యంలోకి తీసుకురావడంలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహా    రాష్ట్రలో దాదాపు వెయ్యి ఔట్‌లెట్లను ప్రారంభించనున్నామని శ్రీనివాస్‌ రావు అన్నారు. 

ఇలా వెయ్యి మంది ఎంటర్‌ప్రూనర్స్‌తో పాటు 2 వేల మందికి హైదరాబాదీ చాయ్‌ తయారీ పై శిక్షణ అందించి ఉద్యోగావకాశాలను   కలి్పస్తామన్నారు. ‘దక్కన్‌ చాయ్‌’ వ్యవస్థాపకులు వీరన్న మాట్లాడుతూ.. ఇప్పటికే 250 ఔట్‌లెట్‌లతో దక్కన్‌ చాయ్‌ తేనీటి విందును అందిస్తున్నాయని, శ్రేయాస్‌ మీడియా భాగస్వామ్యంతో ఈ సేవలు మరింత పెరగనున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆర్ట్‌ ఆఫ్‌ టీ మేకింగ్‌ కోర్సుతో యువతకు శిక్షణ అందించనున్నామని, కొత్తవాళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తామే స్టాల్‌ వేదికగా డిజిటల్‌ యాడ్స్, వాల్‌ మార్ట్‌ రూపంలో అదనంగా ఆదాయం వచ్చేలా రూపకల్పన చేశామన్నారు.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)