Breaking News

హైదరాబాద్‌లో వరుస బాంబు బెదిరింపులు.. రాజ్‌భవన్‌, కోర్టు సహా..

Published on Tue, 07/08/2025 - 13:28

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలోని సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టినట్టు అబీదా అబ్దుల్లా పేరుతో బెదిరింపు మెయిల్‌ వచ్చింది. దీంతో,  పోలీసుల తనిఖీలు చేపట్టారు. మరోవైపు.. తాజాగా రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్టు తెలుస్తోంది. వరుసు బాంబు బెదిరింపుల ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. 

వివరాల ప్రకారం.. సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు పెట్టినట్టు అబీదా అబ్దుల్లా పేరుతో వార్నింగ్‌ మెయిల్‌ వచ్చింది. బెదిరింపు మెయిల్‌ పంపిన ఆగంతకుడు. నాలుగు ఆర్డీఎక్స్‌ బాంబులు, ఐఈడీలు పెట్టినట్టు మెయిల్‌ పంపించాడు. సిటీ సివిల్ కోర్టుతో పాటుగా నాలుగు చోట్ల బాంబులు పెట్టినట్టు హెచ్చరిక. సిటీ సివిల్‌ కోర్టు, జడ్జి చాంబర్స్‌, జింఖానా క్లబ్‌, జడ్జి క్వార్టర్స్‌లో బాంబులు అమర్చినట్టు మెయిల్‌. 

కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్‌ పేలిపోతుందంటూ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో అతడి మెయిల్‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నాలుగు చోట్ల బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు రావడంతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. చీఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతి ఇచ్చారు. కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)