Breaking News

హైదరాబాద్‌ బిర్యానీకి 6వ స్థానం

Published on Mon, 07/01/2024 - 07:40

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో తనకంటూ ప్రత్యేక ప్రాచుర్యం పొందిన హైదరాబాద్‌ బిర్యానీ మరోసారి తన ఘనతను నిర్ధారించుకుంది. సంప్రదాయ వంటకాలకు సంబంధించిన పరిశోధన, సమీక్షలకు పర్యాటక ప్రదేశాల గురించిన సమాచారానికి పేరొందిన ఆన్‌లైన్‌ వేదిక టేస్ట్‌ అట్లాస్‌.. అత్యున్నత భారతీయ వంటకాల్లో హైదరాబాద్‌ బిర్యానీకి 6వ స్థానాన్ని కట్టబెట్టింది. గతేడాది ఇదే సంస్థ అందించిన ర్యాంకుల్లో మన బిర్యానీకి చోటు దక్కని నేప«థ్యంలో ఈ ఏడాది తన పాపులారిటీని తిరిగి నిలబెట్టుకోగలిగింది. 

సిటీజనులకు అత్యంత ప్రీతిపాత్రమైన వంటకంగానే కాక నగర సంప్రదాయ వంటకాల విశిష్టతను నలుదిశలా చాటేదిగా, దేశ విదేశీ ప్రముఖులకు నగర సందర్శనలో తప్పనిసరిగా ‘రుచి’ంచే మన బిర్యానీ టేస్ట్‌ అట్లాస్‌ జాబితాలో టాప్‌ 10లో నిలవగా.. మన నగరంలో విరివిగా ఇష్టపడే బటర్‌ చికెన్, తందూరీ చికెన్‌ వంటివి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.  

నెం–1 గా మ్యాంగో లస్సీ...     
ఈ జాబితాలో మ్యాంగో లస్సీ నెంబర్‌ 1 గా నిలిచింది. వేసవిలో విరివిగా జనం ఆస్వాదించే ఈ లస్సీకి జాబితాలో అగ్ర స్థానం దక్కింది. అదే విధంగా దాని తర్వాతి స్థానంలో మసాలా చాయ్‌ నిలిచింది. ఇది అనేకమందికి,  నగర వాసులకు రోజువారీ అవసరం అనేది తెలిసిందే. ఫుడ్‌ లవర్స్‌ ఇష్టపడే బటర్‌ గార్లిక్‌ నాన్‌కు మూడో ర్యాంక్‌ దక్కింది. ఆ తర్వాత అమృత్‌ సర్‌ కుల్చా, బటర్‌ చికెన్‌ వరుసగా నాల్గు, ఐదు ర్యాంక్‌లు దక్కాయి. ఆ తర్వాత మన హైదరాబాద్‌ బిర్యానీ ఆరు, షాహి పనీర్‌ ఏడు, చోలే భటూర్‌ ఎనిమిది, తందూరీ చికెన్‌ తొమ్మిది, కోర్మా పదో ర్యాంకును దక్కించుకున్నాయి. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)