Breaking News

Amberpet flyover: ట్రాఫిక్‌ కష్టాలు తీరాయ్‌!

Published on Thu, 02/27/2025 - 10:36

హైదరాబాద్‌: అంబర్‌పేట ఫ్లైఓవర్‌(Amberpet flyover) బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరపడింది. ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో ట్రాఫిక్‌ కష్టాలు చెక్‌ పెట్టినట్టయింది.  ఏడేళ్ల క్రితం వరంగల్‌ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్‌ నిర్మాణం ప్రారంభించడంతో నిత్యం వేలాది వాహనదారులు అంబర్‌పేట మీదుగా వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. 

ఉప్పల్, రామంతాపూర్‌ ప్రాంతాల వారు చాదర్‌ఘట్‌ వెళ్లడానికి అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తా మీదుగా వాహనాలను మళ్లించుకుని అలీకేఫ్, గోల్నాక కొత్త బ్రిడ్జి మీదుగా కాచిగూడ కబేళా, చాదర్‌ఘాట్‌కు చేరుకునే వారు. ట్రాఫిక్‌ కష్టాలతో పాటు అరగంట సమయం వృథా అయ్యేది. అలాగే దిల్‌సుక్‌నగర్‌ నుంచి ఛే నంబర్‌ చౌరస్తా మీదుగా శివం, నల్లకుంట వారు వెళ్లే వారు సైతం గోల్నాక మీదుగా చిన్న చిన్న గల్లీల్లో నుంచి అతికష్టం మీద చేరుకోవాల్సి వచ్చేది. 

చాదర్‌ఘాట్‌ నుంచి ఉప్పల్‌ వెళ్లే వారు నల్లకుంట శంకర్‌మఠం, విద్యానగర్, తార్నాక మీదుగా వెళ్లాల్సివచ్చేది. కాగా.. అంబర్‌పేట ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో వేలాది వాహనదారులు ఎంతో ఉపశమనం పొందారు. బుధవారం ఉదయం నుంచి వాహనదారులు ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగించారు.  

ఇక కింద పనుల్లో వేగం.. 
ఫ్లైఓవర్‌ పై నుంచి వాహనాలను అనుమతించడంతో కింద ట్రాఫిక్‌ తగ్గింది. దీంతో ఫ్లైఓవర్‌సర్వీసు పెండింగ్‌ పనుల్లో వేగం పెంచేందుకు అవకాశం ఉంది. రెండు వైపులా సరీ్వసు రోడ్డు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు. అలాగే కొన్ని సున్నిత అంశాలు సైతం ముడిపడి ఉండడంతో సర్వీసు రోడ్డు సమస్యగా మారింది. ఇకపై కింద నుంచి వాహనాల రద్దీ తగ్గడంతో జరుగుతున్న పనుల్లో వేగం పెరిగే ఆవకాశం ఉంది.  

 

#

Tags : 1

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)