Breaking News

జస్టిస్‌ రామలింగేశ్వర్‌రావు కన్నుమూత

Published on Sat, 04/06/2024 - 05:54

సాక్షి, హైదరాబాద్‌: జస్టిస్‌ ఎ.రామలింగేశ్వర్‌రావు గుండె పోటు తో కన్ను మూశారు. జర్మనీలో ఉన్న కూతురును చూడడానికి వెళ్లగా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా రామలింగేశ్వర్‌రావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1956, మే 21న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఆయన జన్మించారు. ఉస్మానియా నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసిన ఆయన 1982లో న్యాయవాదిగా నమోదు చేసుకు న్నారు. 1984లో జస్టిస్‌ ఏ.వెంకట్రామిరెడ్డి వద్ద జూనియర్‌గా చేరి 1987లో స్వతంత్ర న్యాయ వాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే ఉస్మానియాలో పార్ట్‌టైమ్‌ లెక్చరర్‌గా పీజీ విద్యార్థులకు ఇంటర్నేషనల్‌ లా పాఠాలు చెప్పారు.

2013లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే వరకు సామాజిక న్యాయం, పర్యావరణంతోపాటు పలు విభాగాల్లో సమర్థవంతమైన న్యాయవాదిగా వాదనలు వినిపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అడవుల రక్షణకు వాదించిన కేసు దేశమంతటా ‘సమత’ కేసుగా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వ న్యాయవాదిగా, టీటీడీ, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ తదితరాలకు న్యాయవాదిగా పనిచేశారు. సాహిత్యం, కళలపై ఆయనకు మక్కువ ఎక్కువ. విపరీతంగా పుస్తకాలు చదవడంతో పాటు రాయడం అలవాటు. న్యాయమూర్తిగా దాదాపు 13 వేల తీర్పులు ఇచ్చారు. వీటిలో 100కు పైగా లా జర్నల్‌లో ప్రచురితం కావడం విశేషం. 2018లో న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు. అనంతరం ఏపీ ప్రభుత్వం ఆయన్ను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చైర్మన్‌గా నియమించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)