Breaking News

కూకట్‌పల్లిలో దారుణం.. తన బంధానికి అడ్డొస్తున్నాడని చెల్లెలి భర్తతో..

Published on Mon, 04/21/2025 - 12:50

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లిలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం, వేధింపుల కారణంగా కట్టుకున్న భర్తనే భార్య హత్య చేసిన ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, సదరు భార్యాభర్తలు ఇద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన సాయిల్‌, కవిత ఇద్దరూ భార్యాభర్తలు. కొన్నేళ్లుగా వీరద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. భార్య, భర్త ఇద్దరికి కూడా వేరువేరుగా వివాహేతర సంబంధాలు ఉన్నాయి. అయితే, కొద్ది నెలలుగా వీరి మళ్లీ కలిసి ఒకటిగా ఉంటున్నారు. ఈ క్రమంలో సాయిల్‌ ఆమెను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. భర్త వేధింపులు భరించలేక కవిత విసుగు చెందింది. దీంతో, భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్‌ చేసింది. తన చెల్లెలు భర్తతో కలిసి.. సాయిలును హత్య చేసేందుకు నిర్ణయించుకుంది. అనంతరం, తన భర్త సాయిల్‌కు కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపేశారు. అతడు మృతిచెందిన తర్వాత కూకట్‌పల్లిలో సాయిల్‌ను పూడ్చిపెట్టారు.

అయితే, సాయిల్‌ కొద్దిరోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు భార్య కవితను ప్రశ్నించారు. ఈ క్రమంలో కవిత.. తన భర్త పని కోసం హైదరాబాద్‌కు వెళ్లినట్టు చెప్పుకొచ్చింది. అయినప్పటికీ సాయిల్‌ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు, గ్రామ సర్పంచ్‌కు కవితపై అనుమానం వచ్చింది. దీంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కవితను విచారించగా.. హత్య విషయం బయటకు వచ్చింది. అనంతరం, సాయిల్‌ మృతదేహాన్ని బయటకు తీసి.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 

 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)