44కు చేరిన కల్తీ కల్లు బాధితులు

Published on Fri, 07/11/2025 - 04:41

సాక్షి, హైదరాబాద్‌/ లక్డీకాపూల్‌: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య 44కు పెరిగింది. కల్తీ కల్లు తాగి ఇప్పటికే ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్పను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మీడియాతో మాట్లాడుతూ.. నిమ్స్‌లో 31 మంది చికిత్స పొందుతున్నారని, వీరిలో 27 మంది కోలుకున్నట్లు తెలిపారు. వీరిని శుక్రవారం నుంచి దశలవారీగా డిశ్చార్జి చేస్తారని వెల్లడించారు. 

నాలుగైదు రోజుల్లో అందరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. నలుగురు బాధితులకు డయాలసిస్‌ కొనసాగుతోందని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారని, మరో ఏడుగురు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరినట్లు వివరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మంత్రి వెంట నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.నిమ్మ సత్యనారాయణ, ఏఎంఎస్‌ డా.చరణ్‌రాజ్‌ తదితరులు ఉన్నారు.  

నెఫ్రోటాక్సిక్స్‌ వల్లే.. 
కల్లులో నెఫ్రోటాక్సిక్స్‌ (కొన్ని ఔషధాలు, ఇతర కెమికల్స్‌ కలి సి కిడ్నీలపై చెడు ప్రభావం చూపటం) కలవటం వల్లనే అది తాగినవారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. బాధితుల రక్తంలో సీరం క్రియాటినైన్‌ భారీగా పెరగడంలో వారి కిడ్నీల పనితీరుపై ప్రభావం పడిందని నిమ్స్‌ వైద్యు లు వెల్లడించారు. సాధారణంగా కల్లులో మత్తు కోసం డైజోఫాం, క్లోరోహైడ్రేట్, తీపి కోసం శాక్రిన్, నురగ కోసం అమ్మోనియం లాంటివి కలుపుతుంటారు. 

ఈ కల్లులో నెఫ్రోటాక్సిక్స్‌ కలవటం వల్లే ఎక్కువ మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు మరణించారు. కండరాలపై శ్రమ పెరిగినప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే క్రియాటినైన్‌ను మూత్రపిండాలు రక్తం నుంచి శుద్ధి చేసి బయటకు పంపిస్తాయి. కానీ, ఈ క్రియాటి నైన్‌ అసాధారణంగా పెరిగిపోయినప్పుడు కిడ్నీలే దెబ్బతింటాయి. అప్పుడు ఈ వ్యర్ధ పదార్థం గుండె, మెదడుతోపాటు ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుందని నిమ్స్‌ అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చరణ్‌రాజ్‌ వివరించారు. అలాంటి సమయంలో వెంటనే డయాలసిస్‌ చేయకపోతే వ్యక్తి మరణించే ప్రమాదం ఉంటుందని తెలిపారు. 

సమగ్ర నివేదిక ఇవ్వండి: మానవ హక్కుల కమిషన్‌
కల్తీ కల్లు సేవించి ఆరుగురు మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై 20వ తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీని ఆదేశించింది. న్యాయవాది ఇమ్మనేని రామరావుతోపాటు పలువురు ఫిర్యాదు చేయటంతో ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్, సభ్యులు శివాది ప్రవీణ, బి.కిషోర్‌లతో కూడిన బెంచ్‌ గురువారం విచారణ చేపట్టి పోలీసులకు పలు ఆదేశాలిచ్చింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)