Breaking News

13 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు.. 13 నిమిషాలు..

Published on Sat, 01/18/2025 - 05:10

సాక్షి, హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ నుంచి ఖైరతాబాద్‌కు గ్రీన్‌చానల్‌ ద్వారా మెట్రో రైల్‌లో గుండెను తరలించారు. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 34 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించడంతో ఆ మేరకు జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. అప్పటికే గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిని, ఖైరతాబాద్‌ గ్లెనిగల్‌ గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల వ్యక్తికి బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తి గుండెను అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు.

డాక్టర్‌ అజయ్‌జోషి నేతృత్వంలోని వైద్య బృందం శుక్రవారం సాయంత్రం కామినేని ఆస్పత్రికి చేరుకుని, దాత శరీరం నుంచి గుండెను సేకరించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో దీన్ని తీసుకుని ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వైద్య బృందం రాత్రి 9.30 గంటలకు ఎల్బీనగర్‌ నుంచి మెట్రోలో బయలుదేరి 9.43 గంటలకు ఖైరతాబాద్‌ చేరుకుంది.

పోలీసులు, మెట్రో అధికారులు, జీవన్‌దాన్‌ సంయుక్త ఆధ్వర్యంలో గ్రీన్‌చానల్‌ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, మూసారాంబాగ్, మలక్‌పేట్, ఎంజీబీఎస్, నాంపల్లి, అసెంబ్లీ, ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్లను మూసివేసి, ప్రయాణికుల రాకపోకలను నిలిపివేశారు. 13 కిలోమీటర్లు, 13 స్టేషన్లు దాటుకుని, 13 నిమిషాల్లో రైలు గమ్యస్థానానికి చేరుకుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)