Breaking News

నిజామాబాద్‌ మార్కెట్‌కు భారీగా పసుపు

Published on Fri, 05/02/2025 - 04:34

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పసుపు విషయంలో రాష్ట్రంలో పెద్దదైన నిజామాబాద్‌ మార్కెట్‌కు ప్రస్తుత సీజన్‌లో భారీగా పసుపు వస్తోంది. నిజామాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలైన జగిత్యాల, నిర్మల్‌ తదితర జిల్లాల్లో పసుపు సాగు విస్తీర్ణంతో పాటు దిగబడులు సైతం పెరిగాయి. రాష్ట్రంలో పండుతున్న పసుపులో దాదాపు 70 నుంచి 80 శాతం పసుపు నిజామాబాద్‌ మార్కెట్‌కు వస్తుంది. ఇక 2023–24 సీజన్‌ (జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌) నెలల్లో ఇందూరు మార్కెట్‌కు 4,55,398 క్వింటాళ్ల పసుపు వచ్చింది. 

2020–21 ఆర్థిక సంవత్సరంలో 8,55,516 క్వింటాళ్లు, 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8,38,932 క్వింటాళ్లు, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7,49,072 క్వింటాళ్లు, 2023– 24 ఆర్థిక సంవత్సరంలో 7,23,470 క్వింటాళ్ల పసుపు మార్కెట్‌కు వచ్చింది. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7,59,915 క్వింటాళ్ల పసుపు ఇందూరు మార్కెట్‌కు వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 1,37,947 క్వింటాళ్ల పసుపు వచ్చింది.  

గత సీజన్‌లో రాష్ట్రంలో సగటున ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది తెగుళ్లు సోకకపోవడంతో ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల ఎక రాల్లో పసుపు సాగు చేయగా.. ఇందులో 19 వేల ఎకరాలు నిజామాబాద్‌ జిల్లా రైతులు సాగు చేశా రు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ఎకరాలు సాగు చేయగా, ఇందులో నిజామాబాద్‌ జిల్లా రైతులు 22 వేల ఎకరాల పసుపు సాగు చేశారు. 

ఈ సీజన్‌లో ఇప్పటివరకు పసుపు ధక అత్యధికంగా క్వింటాకు రూ.15,800 పలికింది. ప్రస్తుతం క్వింటాకు రూ.13,949 ధర పలుకుతోంది. నిజామాబాద్‌ మార్కెట్‌లో తేమ శాతం, కర్కుమిన్‌ శాతం సైతం తీస్తున్నారు. ఇక కర్కుమిన్‌ 3 శాతం ఉంటుందని మార్కెట్‌ కమిటీ అధికారులు తెలిపారు. 

పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో.. ఈసారి రైతులు పసుపు సాగుకు మొగ్గు చూపడంతో విస్తీర్ణం పెరిగింది. పైగా గత ఏడాది సగటున పసుపు ధర రూ.18 వేల వరకు పలికింది. సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇది కూడా ఒక కారణమని అధికారులు తెలిపారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)