Breaking News

47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు

Published on Mon, 05/06/2024 - 05:37

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత ఏడాది మే నెలాఖరులో పెద్దపల్లి జిల్లాలో ఏకంగా 47.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదవగా.. ఈసారి మే మొదటివారంలోనే దానికి సమీపానికి చేరింది. ఆదివారం జగిత్యా­ల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

అదే విధంగా జగిత్యాల జిల్లా గొదురులో 46.8, అల్లీపూర్‌లో 46.7, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ విభాగం వెల్లడించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. ఎండల వేడి తార స్థాయికి చేరడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

మరో రెండు రోజులు ఇలాగే.. వానలకూ చాన్స్‌ 
రాష్ట్రంలో మరో రెండు రోజులు ఇలాగే ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని.. వడగాడ్పులు తీవ్రంగా వీచే అవకాశమూ ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కొనసాగుతున్నా.. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని వెల్లడించింది. 

మంగళ, బుధ, గురువారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. వర్షాలకు సంబంధించి.. జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)