Breaking News

2 కి.మీ. నిడివి రూ. 332 కోట్ల వ్యయం

Published on Thu, 01/30/2025 - 04:28

సాక్షి, హైదరాబాద్‌: సిరిసిల్ల సమీపంలో మానేరునదిపై 2.4 కిలోమీటర్ల పొడవుతో భారీ రైలువంతెన నిర్మించనున్నారు. ఇందుకు రూ.332 కోట్లు ఖర్చు కానుంది. కరీంనగర్‌ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌తో నేరుగా అనుసంధానించే మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం గోదావరి నదిపై పెద్ద వంతెనలున్నాయి. ఇప్పుడు మానేరుపై నిర్మించే ఈ వంతెన వాటి సరసన చేరనుంది. 

విజయవాడ రైలు వంతెన తరహాలో..
కృష్ణానదిపై విజయవాడ వద్ద నిర్మించిన రైలు వంతెన తరహాలో ఇనుప గర్డర్లతో దీన్ని రూపొందించబోతున్నారు. రైళ్లు వేగంగా వెళ్లినప్పుడు ఏర్పడే కంపన ప్రభావం పిల్లర్లపై పెద్దగా ప్రభావం చూపకుండా ఇనుప గర్డర్లు అడ్డుకుంటాయి. దీంతో ఈ డిజైన్‌కు మొగ్గు చూపారు. 

భారీ వరద పోటెత్తినా ఇబ్బంది కానిరీతిలో..
మనోహరాబాద్‌–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు రైలు సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిద్దిపేట–సిరిసిల్ల మధ్య పనులు జరుగుతున్నాయి. రైలు సిరిసిల్లకు చేరుకోవాలంటే మానేరు నదిని దాటాలి. 

సిరిసిల్ల శివారులో రైల్వే స్టేషన్‌ నిర్మిస్తున్నారు. అక్కడకు చేరుకునే మార్గానికి కేవలం 10 కి.మీ. దూరంలో మిడ్‌ మానేరు జలాశయం ఉంది. దీంతో అక్కడ బ్యాక్‌ వాటర్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వానాకాలంలో నీటి నిల్వ పెరిగి నది మరింత వెడల్పుతో ప్రవహిస్తుంది.

గతంలో గరిష్ట నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకుని అంతకంటే ఎక్కువ నీళ్లు చేరినా రైలు మార్గానికి ఇబ్బంది కాని రీతిలో వంతెనకు డిజైన్‌ చేశారు. దీంతో 2.4 కి.మీ. నిడివితో నిర్మించాలని నిర్ణయించారు. నదీతీరంలో ఉన్న గోపాలరావుపల్లి వద్ద వంతెన నిర్మాణం ప్రారంభమై.. సిరిసిల్ల వైపు అనుపురం గ్రామపరిధిలో ల్యాండ్‌ అవుతుంది. 

120 కి.మీ. వేగంతో రైలు ప్రయాణించేలా..
సాధారణంగా వంతెనలపై రైళ్ల వేగాన్ని కనిష్ట స్థాయికి కుదిస్తారు. ప్రయాణికుల రైళ్లు గంటకు 120 కి.మీ.వేగంతో దూసుకుపోయినా ఇబ్బందికాని విధంగా ఈ వంతెన నిర్మించనున్నారు. అయితే సరుకు రవాణా రైళ్ల గరిష్ట వేగాన్ని 65 కి.మీ.కు అనుమతిస్తారు. 

ఆంగ్ల అక్షరం ‘ఎస్‌’ఆకృతిలో..
ఈ వంతెన ఆంగ్ల అక్షరం ‘ఎస్‌’ఆకృతిలో మలుపుతో ఉంటుంది. వంతెన నిర్మించే ప్రాంతంలో కొంతభాగం అటవీ ప్రాంతం అలైన్‌మెంట్‌లోకి చొచ్చుకొచ్చింది. మరోవైపు గుట్టలున్నాయి. దీంతో వాటిని తప్పిస్తూ ఎస్‌ ఆకృతిలో డిజైన్‌ చేశారు. 

వెంటనే పనులు..
వంతెన పనులను వెంటనే ప్రారంభించేలా దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలిచింది. గతంలో ఈ సెక్షన్‌ మధ్యలో భూ పరిహార మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డిపాజిట్‌ చేయలేదు. దీంతో పనుల్లో జాప్యం జరిగింది. ఇటీవల ఆ మొ త్తం చెల్లించటంతో పనులు జరుగుతున్నాయి. ఇక మానేరు నది అవతల సిరిసిల్ల నుంచి కరీంనగర్‌ (కొత్తపల్లి) వరకు భూసేకరణ ప్రక్రియ నిలిచిపో యింది. 

పరిహారం మొత్తం రూ.40 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల వద్ద డిపాజిట్‌ చేయలేదు. దీంతో భూమి రైల్వే ఆధీనంలోకి రాలేదు. ఫలితంగా అక్కడ టెండర్లు కూడా పిలవలేదు. దీంతో ప్రాజెక్టు అనుకున్న సమ యంలో పూర్తయ్యే పరిస్థితి లేదు. దీంతో మిగ తా పనులతో ప్రమేయం లేకుండా వంతెన భా గాన్ని వేగంగా నిర్మించి, ప్రాజెక్టులో అపరిమిత జాప్యాన్ని నివారించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 

సిరిసిల్ల వైపు లైన్‌ నిర్మాణం పూర్తయ్యేనాటికి వంతెన సిద్ధమయ్యేలా ప్లాన్‌ చేస్తోంది. 18 నుంచి 20 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేయనున్నట్టు పేర్కొంటోంది. 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)