Breaking News

హైదరాబాదా మజాకా! విలాసానికి 'సై'.. లగ్జరీ గృహాల ధరల్లో అత్యధిక వృద్ధి

Published on Wed, 08/09/2023 - 05:10

సాక్షి, హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కోకాపేటలో ఎకరం భూమికి రూ.100 కోట్లు.. మోకిలాలో గజానికి రూ.1,0,5000 ధర పలికిన విషయం తెలిసిందే. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలోనూ మరో మైలురాయి సాధించింది. దేశంలోని ప్రధాన మెట్రోనగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో రికార్డుస్థాయిలో పెరిగాయని అనరాక్‌ గ్రూప్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 

విలాసవంతమైన ఇళ్లలో ఇలా... 
హైదరాబాద్‌లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.7,450గా ఉండగా, 2023 నాటికి ఏకంగా రూ.10,580కి పెరిగింది. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాలలో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర మాత్రమే పెరిగాయి. కరోనా తర్వాత నుంచే లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్‌ పెరగడమే ఈ వృద్ధికి కారణమని అనరాక్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనూజ్‌పూరి తెలిపారు. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.10,210గా ఉండగా, ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది. 

రెండోస్థానంలో హైదరాబాద్‌ 
ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చదరపు అడుగుకు రూ.3,750గా ఉండగా, ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్‌ కేటగిరీలో ఎన్‌సీఆర్‌లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగంలో ధరల వృద్ధిలో హైదరాబాద్‌ రెండోస్థానంలో నిలిచింది. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చదరపు అడుగుకు రూ.4 వేలుగా ఉంది. 

మధ్యతరగతిలోనూ మనమే టాప్‌  
ఐదేళ్ల కాలంలో టాప్‌–7 నగరాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్యతరగతి విభాగంలోని ఇళ్ల విలువల్లో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చదరపు అడుగుకు రూ.6,050లుగా ఉండగా, ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. మన నగరంలో మిడ్‌సైజ్‌ గృహాల ప్రారంభ ధర చదరపు అడుగుకు రూ.5,780గా ఉంది. 

దేశంలోని సగటు చూస్తే..  
2018 నుంచి 2023 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే, విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధిగా నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున 2018లో 12,400గా ఉండగా, 2023 నాటికి 15,350కి పెరిగింది.   

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)