Breaking News

ప్యాకేజీ కవర్ల పరిశ్రమలో భారీ పేలుడు

Published on Mon, 07/17/2023 - 06:29

షాద్‌నగర్‌: ఆహారాన్ని ప్యాక్‌ చేసే సిల్వర్‌ కవర్లను తయారు చేసే ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా.. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పరిధిలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బాధితులంతా ఇతర రాష్ట్రాల వారేనని తెలిసింది. 

పరిమితికి మించిన వేడితో.. 
షాద్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని కాశిరెడ్డిగూడ శివారులో బ్లెండ్‌ కలర్‌ పరిశ్రమ ఉంది. ఇందులో ఫుడ్‌ ప్యాకేజీకి సంబంధించిన సిల్వర్‌ కవర్లను తయారు చేస్తారు. ఇందుకోసం మెటాలిక్‌ పొడిని వినియోగిస్తారు. కార్మికులు రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి విధుల్లో ఉండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో జాజిపతుర, పూర్ణాసింగ్, మందిరి,రాజుసాన్, మంజుదాస్, ప్రదీప్‌మాన్, సత్య, గిరిధర్‌సింగ్, రాహుల్‌ఘడ్, సునీల్‌ ఎంకీతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

వారిని వెంటనే షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి, అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం డీఆర్‌డీఓ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని.. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రుల వివరాలను తెలుసుకున్నారు. పేలుడు షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిందా, మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కంపెనీలో కలర్‌ తయారు చేసే క్రమంలో వాడే మెటాలిక్‌ పొడి పరిమితికి మించి వేడి (ఓవర్‌ హీట్‌) కావడంతో ప్రమాదం జరిగిందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.  

Videos

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)