Breaking News

6 నెలల్లో మళ్లీ పాత పోస్టింగులు!

Published on Thu, 02/19/2026 - 04:25

సాక్షి, హైదరాబాద్‌: ఆరోపణలు గుప్పుమనటంతో ఆ ఉద్యోగులను ఏళ్ల తర్వాత మరోసీటుకు మార్చాల్సి వచ్చింది. ప్రతి ఫైలుకు ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారని స్వ యంగా ఉద్యోగులు లబోదిబోమనటంతో ప్రాధాన్యం లేని కుర్చీకి మార్చారు. కానీ ఆరు నెలల్లోనే మళ్లీ పాత కుర్చీలో కూర్చోబెట్టారు. అవినీతి, విచ్చలవిడి తనానికి కేంద్రంగా ఉన్న దేవాదాయ శాఖలో తాజా బా గోతం ఇది. అవినీతి ఆరోపణలున్న ఉద్యో గులను బదిలీ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు రావటంతో బదిలీ చేసి, మళ్లీ ఆరు నెలలు తిరక్కుండానే పాత విభాగాన్ని అప్పగించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

సరిగ్గా అధికారుల డీపీసీ, పదోన్నతుల వ్యవహా రం జరుగుతున్నప్పుడే ఈ మార్పు చోటు చే సుకోగా.. పదోన్నతులకు ఫైళ్లు సిద్ధం చే సేందుకు భారీ మొత్తంలో డబ్బులు వసూ లు చేస్తున్నారని, అందుకే ఆరు నెలల్లోనే మళ్లీ బదిలీలు చేసి అవినీతి ఆరోపణలున్న ఉద్యోగులను మళ్లీ వారికి నచ్చిన చోటుకు మార్చారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.  

ఏళ్లుగా వివాదాస్పదంగా.. 
దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కొన్ని సెక్షన్లు ఏళ్లుగా వివాదాస్పదంగా మారాయి. పలుకుబడి ఉన్న కొందరు ఉద్యోగులు ఆ సెక్షన్లకు అంటుకుపోయారు. ఫైలు కదలాలంటే రూ.5 వేలు ముట్టచెప్పాల్సిందేనన్నది ఆ సెక్షన్లపై ఉన్న ఆరోపణ. పనిని బట్టి డబ్బులు వసూలు చేస్తారనే ఫిర్యాదులున్నాయి. 

విషయం దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి రావటంతో ఆ ఉద్యోగులను మార్చాలని మౌఖికంగా ఆదేశించారు. దీంతో ఆరు నెలల క్రితం ప్రక్షాళన చేపట్టి ప్రధాన విభాగాల సిబ్బందిని కొందరిని మార్చారు. రెండో విడతలో మిగతా వారిని మార్చాలని నిర్ణయించారు. కానీ, ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చిన మిగతా ఉద్యోగులకు మార్పు లేకుండా చేసుకున్నారు.  

తొలుత ఉన్నతాధికారి.. తర్వాత ఉద్యోగులు 
అవినీతి ఉద్యోగులను మార్చే క్రమ ంలో.. గత ప్రభుత్వ హయాంలో దేవా దాయ శాఖ కమిషనర్‌గా వ్యవహరించిన అనిల్‌కుమార్‌ ఓ ఉన్నతాధికారిపై వేటు వేశారు. బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసే తరుణంలో ఆలయాల నుంచి కూడా వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ అధికారిని అప్రధాన్య పోస్టులోకి మార్చారు. అయితే మరో కమిషనర్‌ వచ్చాక ఆ అధికారి పోస్టు మారింది. అంతేకాదు ఇటీవల ఉన్నట్టుండి ఆయన్ను కీలక పోస్టులోకి తెచ్చారు. 

గతంలో సెక్షన్లలో వసూళ్ల బ్యాచ్‌ ఆయన కనుసన్నల్లో నడిచేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆ ఉన్నతాధికారి కీలక పోస్టులోకి రాగానే, సెక్షన్లలో ఆరు నెలల క్రితం జరిగిన బదిలీలను మార్చి మళ్లీ కొత్త పోస్టింగులు ఇచ్చేయడం గమనార్హం. దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో జరుగుతున్న ఈ తరహా వ్యవహారాలపై దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయానికి సమాచారం ఉండటం లేదని తెలుస్తోంది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)