Breaking News

‘జీఎస్టీ’ దెబ్బ గట్టిగానే!

Published on Thu, 09/18/2025 - 04:41

సాక్షి, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల శ్లాబ్‌ల తగ్గింపు కారణంగా రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రమారమి రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఆయా వస్తువుల అమ్మకాలను బట్టి సుమారు రూ.5–7 వేల కోట్లు నష్టం వస్తుందని వాణిజ్య శాఖ వర్గాలు తమ ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. 

జీఎస్టీ శ్లాబ్‌ల హేతుబద్దీకరణ కారణంగా ఏ మేరకు నష్టం వాటిల్లుతుందనే వివరాలను తెలియజేయాలని ప్రభుత్వం కోరిన మేరకు అన్ని రంగాల్లో వస్తువుల అమ్మకాలకు సంబంధించిన గణాంకాలను తెప్పించిన వాణిజ్య పన్నుల శాఖ ఈ మేరకు నష్ట నిర్ధారణ చేసినట్టు సమాచారం.  

ఎక్కువగా ఈ రంగాల్లోనే.. 
కాగా, జీఎస్టీ రేట్ల శ్లాబ్‌లను హేతుబద్దీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని పలు ప్రధాన రంగాల అమ్మకాలపై ప్రభావం చూపనుంది. రాష్ట్రం నుంచి ఎక్కువగా అమ్ముడయ్యే ఐరన్‌న్‌అండ్‌ స్టీల్, ఆటో మొబైల్స్‌ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పన్నుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రంగాలతో పాటు ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) అమ్మకాలపై వచ్చే పన్నులు కూడా పెద్ద ఎత్తున తగ్గిపోయి భారీ గండి పడుతుందని ఆ శాఖ వర్గాలంటున్నాయి. 

అలాగే టెక్స్‌టైల్స్, సిమెంట్‌ లాంటి కీలక రంగాల ద్వారా వచ్చే ఆదాయం కూడా కుదుపునకు గురవుతుందని, కొన్ని రంగాల్లో కొంత మేర అమ్మకాలు పెరిగినప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో గండి పడటం ఖాయమని ఆ వర్గాలంటున్నాయి. అయితే, జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపుతో ధరలు పెంచాలని ఐరన్‌ అండ్‌ స్టీల్, సిమెంట్‌ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఈ రెండింటి ధరలు పెరిగే అవకాశముందని కూడా వారు అంటున్నారు.  

వివరాల సేకరణకు తంటాలు 
జీఎస్టీ ద్వారా ఏ డీలర్‌ ఏయే సరుకులు, ఎంత మేర అమ్ముతున్నారన్న వివరాలను సేకరించి అంచనాలను రూపొందించడం కష్టతరంగా మారిందని పన్నుల శాఖ వర్గాలు చెపుతున్నాయి. గతంలో వ్యాట్‌ అమల్లో ఉన్నప్పుడు డీలర్‌ కోడ్‌ నమోదు చేస్తే అన్ని సరుకుల వివరాలు వచ్చేవని, ఇప్పుడు జీఎస్టీలో ఆ వివరాలు అందుబాటులోకి రావడం లేదని, ఈ నేపథ్యంలో ప్రతి డీలర్‌ ఏ సరుకులు అమ్ముతున్నాడనే వివరాలను క్షేత్రస్థాయి నుంచి తెప్పించి మదింపు చేయాల్సి వస్తోందని పన్నుల శాఖ వర్గాలు అంటున్నాయి.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)